News February 12, 2025
మందమర్రి PHCని సందర్శించిన DMHO

మందమర్రిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని గదులతో పాటు ఆరోగ్య కేంద్రం పరిధిలోనే ఉన్న క్వార్టర్లను వారం లోపల శుభ్రం చేయించాలని ఆదేశించారు.
Similar News
News September 13, 2025
‘గాంధీ ఆసుపత్రిని మోడల్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తా’

గాంధీ ఆసుపత్రిని మోడల్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని నూతన సూపరింటెండెంట్ డాక్టర్ వాణి అన్నారు. శుక్రవారం ఆమె బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడారు. ఆసుపత్రిలో ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటిని పూర్తిగా పరిశీలించి, పరిస్థితులను మెరుగుపరిచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
News September 13, 2025
పుత్తూరులో రోడ్డు ప్రమాదం.. ఒకరి స్పాట్ డెడ్

పుత్తూరు పట్టణంలోని పరమేశ్వరమంగళం KKC కళాశాల సమీపంలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నై వైపు వెళ్తున్న లారీ అతివేగంగా బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడు సతీశ్ అరక్కోణం మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతి చెందిన సతీశ్, ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News September 13, 2025
బీసీసీఐలో భజ్జీకి కీలక పదవి?

భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌కు బీసీసీఐలో కీలక పదవి దక్కనున్నట్లు తెలుస్తోంది. ఆయనను యాన్యువల్ జనరల్ మీటింగ్(ఏజీఎం)లో తమ ప్రతినిధిగా పంజాబ్ నామినేట్ చేసింది. ఈమేరకు ఆయన ఈనెల 28న జరగనున్న ఏజీఎం మీటింగ్‌కు హాజరుకానున్నారు. అందులో బీసీసీఐ ప్రెసిడెంట్‌తో పాటు ఇతర పోస్టులకు సభ్యులను ఎన్నుకునే అవకాశం ఉంది. మరి భజ్జీని ఏ పదవి వరిస్తుందో చూడాలి.