News July 31, 2024
మందస: రోడ్డు ప్రమాద మృతుల వివరాలు లభ్యం

శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరం జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతీ, యువకుడు మృతిచెందిన విషయం విదితమే. మృతులు మందస మండలం కడుముసాయి గ్రామానికి చెందిన సవర హర్యాని(25), సవర జీవన్ (21)గా పోలీసులు గుర్తించారు. ఇందులో వదిన, మరిది దుర్మరణం పాలయ్యారు. తణుకు నుంచి బైక్ పై గ్రామానికి వస్తుండగా మార్గమధ్యలో ఘటన జరిగింది. శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు.
Similar News
News November 25, 2025
కంచిలి: విషాదం.. 8నెలల గర్భిణి మృతి

మరో నెల రోజులు గడిచి ఉంటే ఆమెకు పండంటి బిడ్డ పుట్టేది. అమ్మగారితో పాటు అత్తగారింట్లో చిన్నారి అడుగులు పడేవి. ఇంతలోనే విషాదం నెలకొంది. బయటి ప్రపంచంలోకి రాకముందే తల్లితో పాటు ఆ శిశువు కన్నుమూసింది. కంచిలి(M) అర్జునాపురానికి చెందిన ధనలక్ష్మి(26) 8నెలల గర్భిణి. నిన్న రాత్రి పురిటి నొప్పులొచ్చాయి. 108కు సమాచారం ఇచ్చారు. ఆసుపత్రికి తరలిస్తుండగా బిడ్డతో సహా ధనలక్ష్మి ప్రాణాలొదిలింది.
News November 25, 2025
పలాస జిల్లా లేనట్లేనా..?

పలాస కేంద్రంగా ఉద్దానం ఏరియాను జిల్లాను చేయాలనే డిమాండ్ ఇక్కడి ప్రజల్లో ఉంది. గత ప్రభుత్వం పలాసను జిల్లా చేస్తామని ప్రకటించినప్పటికీ.. కేవలం రెవెన్యూ డివిజన్గా మార్చి వదిలేసింది. జిల్లాగా ప్రకటించకపోవడంతో పలాసతో పాటు ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈప్రభుత్వంలోనైనా ఏర్పాటు అవుతుందని అందరూ భావించారు. దీనిపై అసలు చర్చే లేకపోవడంతో జిల్లా లేనట్టేనని తెలుస్తోంది.
News November 25, 2025
జాతీయస్థాయి పోటీలకు సిక్కోలు విద్యార్థిని ఎంపిక

జి.సిగడం కేజీబీవీ ఇంటర్మీడియట్ మొదటి ఏడాది చదువుతున్న విద్యార్థిని ఆర్.స్వాతి జాతీయస్థాయి పరుగు పందేనికి ఎంపికైంది. హర్యానాలో ఈ నెల 26 నుంచి 30 వరకు అండర్-19 క్యాటగిరీలో 4×100 రిలే పరుగు పందెంలో పాల్గొననుంది. రాష్ట్రస్థాయి ఉత్తమ ప్రదర్శనతో జాతీయస్థాయికి ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రమీల తెలిపారు. విద్యార్థినిని ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు.


