News March 30, 2025

ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన BHPL కలెక్టర్

image

ముస్లిం ప్రజలకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఆదివారం ఒక ప్రకటన జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంజాన్ పవిత్రమైన నెలగా, త్యాగం, భక్తి, సహనం, మానవతా విలువల ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ఉపవాస దీక్ష, ప్రార్థనలు, దానం వంటి ఆచారాలు సామాజిక సమగ్రతను పెంపొందిస్తాయని, అందరూ కలిసికట్టుగా సమాజంలో శాంతి, ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు.

Similar News

News April 6, 2025

గద్వాలలో ఉప ఎన్నికలు: KCR

image

గద్వాల నియోజకవర్గంలో ఉప ఎన్నికలు వస్తాయని.. అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలని మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సూచించినట్లు BRS గద్వాల నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాసుల హనుమంతు నాయుడు అన్నారు. శనివారం KCR అధ్యక్షతన జరిగిన సన్నాహక సమావేశానికి ఆయన హాజరయ్యారు. నియోజకవర్గంలో పూర్తి బాధ్యతలు తీసుకోవాలని చెప్పినట్లు హనుమంతు నాయుడు తెలిపారు. 

News April 6, 2025

వరంగల్: జాబ్ మేళా పోస్టర్‌ను ఆవిష్కరించిన మంత్రి

image

వరంగల్ జిల్లా నిరుద్యోగ యువతీయువకులకు ఈ నెల 11న టాస్క్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేస్తున్న మెగా జాబ్ మేళా పోస్టరును కలెక్టర్ సత్య శారదా దేవి, మేయర్ గుండు సుధారాణితో మంత్రి సురేఖ శనివారం ఆవిష్కరించారు. జిల్లాలో నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. జిల్లా పర్యటనలో భాగంగా జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. 

News April 6, 2025

జాగ్వార్ ఎగుమతుల నిలిపివేత

image

టాటాకు చెందిన ‘జాగ్వార్ ల్యాండ్‌రోవర్’ (JLR) సంస్థ తమ లగ్జరీ కార్లను బ్రిటన్‌లో ఉత్పత్తి చేస్తుంటుంది. బ్రిటన్‌ ఉత్పత్తులపై ట్రంప్ 25శాతం సుంకాన్ని విధించిన నేపథ్యంలో USకు కార్ల ఎగుమతిని నిలిపేయాలని ఆ సంస్థ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘ది టైమ్స్’ కథనం ప్రకారం.. నెల రోజుల పాటు తమ నిర్ణయాన్ని అమలుచేయాలని JLR యోచిస్తోంది. 2 నెలలకు సరిపడా ఎగుమతుల్ని ఇప్పటికే USకు పంపించినట్లు సమాచారం.

error: Content is protected !!