News April 6, 2025
జాగ్వార్ ఎగుమతుల నిలిపివేత

టాటాకు చెందిన ‘జాగ్వార్ ల్యాండ్‌రోవర్’ (JLR) సంస్థ తమ లగ్జరీ కార్లను బ్రిటన్‌లో ఉత్పత్తి చేస్తుంటుంది. బ్రిటన్ ఉత్పత్తులపై ట్రంప్ 25శాతం సుంకాన్ని విధించిన నేపథ్యంలో USకు కార్ల ఎగుమతిని నిలిపేయాలని ఆ సంస్థ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘ది టైమ్స్’ కథనం ప్రకారం.. నెల రోజుల పాటు తమ నిర్ణయాన్ని అమలుచేయాలని JLR యోచిస్తోంది. 2 నెలలకు సరిపడా ఎగుమతుల్ని ఇప్పటికే USకు పంపించినట్లు సమాచారం.
Similar News
News April 24, 2025
ఉపాధి హామీ.. ‘కూలీ’ అనే పదం వాడొద్దు: పవన్

AP: ఉపాధి హామీ పథకంలో 75లక్షల మందికి పైగా శ్రామికులకు నిధులు ఇచ్చామని Dy.CM పవన్ కళ్యాణ్ తెలిపారు. ఉపాధి హామీ పథకంలో కూలీ అనే పదానికి బదులుగా గ్రామీణ వికాస శ్రామికుడు అనే పదాన్ని వాడాలని అన్నారు. మంగళగిరిలో జరిగిన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంలో ఆయన ప్రసంగించారు. గత ప్రభుత్వం వల్ల గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. తాను పంచాయతీరాజ్ శాఖను చాలా ఇష్టంగా ఎంచుకున్నానని చెప్పారు.
News April 24, 2025
పాకిస్థానీ అంటూ ఆరోపణలు: స్పందించిన ప్రభాస్ హీరోయిన్

తాను పాకిస్థాన్ సంతతి యువతినంటూ వస్తున్న వార్తల్ని ‘ఫౌజీ’ హీరోయిన్ ఇమాన్వీ ఖండించారు. ‘నేను పాకిస్థానీ సైనికాధికారి కూతురినన్నది పచ్చిఅబద్ధం. ఆన్‌లైన్ ట్రోలర్లు ఆ విషయాన్ని వ్యాప్తి చేశారు. మా తల్లిదండ్రులు లాస్‌ఏంజిలిస్‌కు వలస వెళ్లారు. నేను అక్కడే పుట్టాను. హిందీ, తెలుగు, గుజరాత్, ఇంగ్లిష్ మాట్లాడే భారత సంతతి అమ్మాయిని నేను. ఈ బాధాకర సమయంలో ద్వేషాన్ని కాదు.. ప్రేమను వ్యాప్తి చేయండి’ అని కోరారు.
News April 24, 2025
నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా: రెహమాన్

తన విడాకుల సమయంలో ట్రోల్ చేసిన వారిపై ఎలాంటి కోపం లేదని, వారిని తన కుటుంబ సభ్యులుగానే భావిస్తానని AR రెహమాన్ అన్నారు. తాను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతానన్నారు. ఒకరిపై మనం చెడు ప్రచారం చేస్తే మన గురించి మరొకరు తప్పుగా చెబుతారని ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఎవరి గురించైనా తప్పుగా మాట్లాడినప్పుడు మనకూ ఓ కుటుంబం ఉందనే ఆలోచనతో ఉండాలని సూచించారు.