News April 1, 2025

మేడ్చల్‌లో 33 వేల మెట్రిక్ టన్నుల వరి దిగుబడి

image

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో యాసంగి సీజన్లో సాధారణ వరిపంట సాగు విస్తీర్ణం 10,454 ఎకరాలు కాగా, రైతులు 11,015 ఎకరాల్లో వరి పంట వేశారు. వరి దిగుబడి 33 వేల మెట్రిక్ టన్నులు వచ్చే అవకాశం ఉందని జిల్లా వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. రైతుల నుంచి పంట మంచి దిగుబడి సాధించడంతో జిల్లాలో మున్ముందు ఆహార ఉత్పత్తిలో వృద్ధి చెందుతుందని భావిస్తున్నారు.

Similar News

News April 4, 2025

నంద్యాలలో ఈనెల 10న జాబ్ మేళా

image

ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఏప్రిల్ 10న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. ఈ జాబ్ మేళాకు 14 ప్రైవేటు కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. పదవ తరగతి, ఐటీఐ, డిప్లొమా, ఇంటర్, డిగ్రీ, B.Tech (Mechanical), B/D/M.Pharmacy, పీజీ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులన్నారు.

News April 4, 2025

బుచ్చిబాబుకు రామ్ చరణ్ స్పెషల్ గిఫ్ట్

image

డైరెక్టర్ బుచ్చిబాబుకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేక బహుమతి ఇచ్చారు. ఇటీవల 40వ బర్త్ డే జరుపుకున్న చరణ్.. జై శ్రీరామ్ అని రాసి ఉన్న ఆంజనేయస్వామి పాదుకలను డైరెక్టర్‌కు బహుమతిగా పంపారు. గిఫ్ట్ అందుకున్న బుచ్చిబాబు సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఆయన పోస్ట్ చేసిన ఫొటోలు SMలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం బుచ్చిబాబు రామ్ చరణ్‌తో ‘పెద్ది’ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

News April 4, 2025

బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావు

image

TG: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిని బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసింది. డా.ఎన్.గౌతమ్ రావును బరిలో నిలపాలని నిర్ణయించింది. సోషియాలజీలో డాక్టరేట్ పొందిన గౌతమ్ రావు విజ్ఞాన భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఛైర్మన్‌గా ఉన్నారు. గతంలో హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బీజేపీ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. ఈ ఎమ్మెల్సీ స్థానానికి ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుండగా, 25న ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు.

error: Content is protected !!