News April 4, 2025
బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావు

TG: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిని బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసింది. డా.ఎన్.గౌతమ్ రావును బరిలో నిలపాలని నిర్ణయించింది. సోషియాలజీలో డాక్టరేట్ పొందిన గౌతమ్ రావు విజ్ఞాన భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఛైర్మన్‌గా ఉన్నారు. గతంలో హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బీజేపీ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. ఈ ఎమ్మెల్సీ స్థానానికి ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుండగా, 25న ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు.
Similar News
News April 18, 2025
దేశానికి ఆదర్శంగా నిలిచేలా బెట్టింగ్ వ్యతిరేక విధానం తెస్తాం: లోకేశ్

AP: బెట్టింగ్ యాప్స్‌ను నిషేధించాలని యూట్యూబర్ అన్వేష్ చేసిన ట్వీట్‌కు మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ‘బెట్టింగ్ యాప్‌లు జీవితాలను నాశనం చేస్తున్నాయి. జూదానికి బానిసైన వందలాది మంది హృదయ విదారక కథలను వింటున్నా. వీటిని ఆపేయాలి. నిరంతర అవగాహన, కఠినంగా వ్యవహరించడమే దీనికి దీర్ఘకాలిక పరిష్కారం. దేశానికే ఆదర్శంగా నిలిచేలా బెట్టింగ్ వ్యతిరేక విధానాన్ని రూపొందించేందుకు కృషి చేస్తున్నాం’ అని పేర్కొన్నారు.
News April 18, 2025
గర్భిణిని కాపాడిన ChatGPT

నార్త్ కరోలినాలోని(USA) షార్లెట్‌కు చెందిన నటాలియా టారియన్ అనే 8 నెలల గర్భిణికి ChatGPT చేసిన హెచ్చరిక ఆమె ప్రాణాలను కాపాడేలా చేసింది. తన దవడ బిగుతుగా అనిపిస్తోందని ఇందుకు కారణమేంటని నటారియా ChatGPTని అడగ్గా ఆమె బీపీని చెక్ చేసుకోవాలని తెలిపింది. బీపీ ఒక్కసారిగా పెరగడంతో వెంటనే అంబులెన్స్‌కు కాల్ చేయాలని Ai సూచించింది. ఆస్పత్రిలో బీపీ 200/146గా ఉండటంతో వెంటనే ప్రసవం చేసి తల్లీబిడ్డను కాపాడారు.
News April 18, 2025
సిట్ విచారణకు విజయసాయి హాజరు

AP: మద్యం కుంభకోణం ఆరోపణల కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. కాసేపటి కిందటే విజయవాడలోని సిట్ ఆఫీసుకు చేరుకున్నారు. దీంతో ఆయన అధికారులకు ఏం చెప్తారనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఈ స్కామ్‌కు కసిరెడ్డి రాజశేఖరే కీలక సూత్రధారి అని ఇటీవల విజయసాయి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీంతో ఈ కేసులో సాక్షిగా విచారించేందుకు ఆయనకు సిట్ నోటీసులు ఇచ్చింది.