News April 8, 2025
రాజమండ్రి: ‘ఉచిత వైద్య శిబిరాలను వినియోగించుకోవాలి’

రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ డీఎంహెచ్ఓ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం సోమవారం నిర్వహించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సోమవారం స్థానిక ఎస్.టి హాస్టల్లో శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎన్. శ్రీ లక్ష్మి పాల్గొని మాట్లాడారు. అందరూ ఆహార, శుభ్రత నియమాలు పాటించాలని సూచించారు.
Similar News
News April 19, 2025
ప్రవీణ్ శరీరంపై 18 గాయాలున్నాయి: హర్షకుమార్

పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసులో పోస్టుమార్టం రిపోర్టు బహిర్గతం చేయడానికి ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తోందని మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ నిలదీశారు.శుక్రవారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రవీణ్ కేసులో పోలీసుల దర్యాప్తును తనతో సహా ఎవ్వరూ విశ్వసించడం లేదని వ్యాఖ్యానించారు. తన వద్దకు వచ్చిన పోస్టుమార్టం రిపోర్ట్ ప్రకారం ప్రవీణ్‌పై 18 శరీరంపై గాయాలున్నాయని, ఇది ముమ్మాటికీ హత్యే అని పేర్కొన్నారు.
News April 18, 2025
తూ.గో. జిల్లా ప్రజలకు హెచ్చరిక

తూర్పు గోదావరి జిల్లా ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నేడు జిల్లాలో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని APSDMA సూచించింది. చెట్ల కింద ఎవరూ ఉండవద్దని హెచ్చరించింది.
News April 18, 2025
RJY: డోర్ డెలివరీ కేసు.. ప్రత్యేక న్యాయవాదిగా ముప్పాళ్ల

ఏపీలో సంచలనం రేకెత్తించిన వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ అలియాస్ అనంతబాబు డోర్‌డెలివరీ కేసులో న్యాయ విచారణకు ఏపీ ప్రభుత్వం ఈ మేరకు గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఈ న్యాయ విచారణలో ప్రాసిక్యూషన్‌కు సహాయం చేయడానికి ప్రత్యేక న్యాయవాదిగా ప్రముఖ సీనియర్ న్యాయవాది, ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సెల్ సభ్యుడు, మానవ హక్కుల రక్షణ కోసం పోరాటం చేస్తున్న ముప్పాళ్ల సుబ్బారావును నియమించింది.