News April 19, 2024
రాజ్నాథ్ సింగ్ హెలికాప్టర్లో ఎన్నికల అధికారుల తనిఖీలు

ఖమ్మంలో బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోదరావు తరపున ఎన్నికల ప్రచారం కోసం కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ హెలికాప్టర్లో వచ్చారు. దీంతో ఎన్నికల సిబ్బంది, ఫ్లయింగ్ స్కాడ్ హెలికాప్టర్ను తనిఖీ చేశారు. జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి కె. సత్యనారాయణ, శిక్షణ కలెక్టర్ మిర్నల్ శ్రేష్ఠలు తనిఖీ చేశారు. 10నిమిషాల పాటు ఈ తనిఖీలు జరిగాయి. ఈ సోదాల్లో ఎలాంటి నగదు, వస్తువులు లభించలేదని అధికారులు వెల్లడించారు.
Similar News
News April 22, 2025
ఖమ్మం జిల్లా ఇంటర్ రిజల్ట్స్

ఇంటర్ ఫలితాల్లో ఖమ్మం జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. సెకండ్ ఇయర్లో 16919 మంది పరీక్షలు రాయగా 12996 మంది పాసయ్యారు. 76.81 శాతం పాస్ పర్సంటేజీ వచ్చింది. ఫస్ట్ ఇయర్లో 17837 మందికి 12476 మంది పాసయ్యారు. పాస్ పర్సంటేజీ 69.94 శాతం.
News April 22, 2025
ఖమ్మం జిల్లా జైలులో పనికిరాని ఇనుప సామగ్రి వేలం

పనికిరాని ఇనుప సామగ్రిని ప్రజల సమక్షంలో బహిరంగ వేలం వేస్తున్నట్టు ఖమ్మం జిల్లా జైలు సూపరింటెండెంట్ శ్రీధర్ తెలిపారు. జైలులోని ఫ్యాక్టరీ స్క్రాప్ను ఈనెల 25న వేలం నిర్వహిస్తున్నామని, ఆసక్తిగలవారు రూ.5వేలు కనీస ధరావత్తు చెల్లించి వేలంలో పాల్గొనాలని కోరారు. మరింత సమాచారం కొరకు జిల్లా జైలర్లు సక్రునాయక్ (94946 32552), లక్ష్మీ నారాయణ(97005 05151)ను సంప్రదించాలని తెలిపారు.
News April 22, 2025
జిల్లాలో ముమ్మరంగా ధాన్యం కనుగొళ్లు

ఖమ్మం జిల్లాలో యాసంగి ధాన్యం కనుగొళ్లు ముమ్మరంగా సాగుతున్నట్లు జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి చందన్ కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 385 రైతులకు రూ.1.45 కోట్లను చెల్లించినట్లు వెల్లడించారు. 29,056 క్వింటాళ్ల సన్నధాన్యానికి బోనస్ చెల్లించామన్నారు. రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్ద అమ్మకాలు జరిపి మద్దతు ధర, బోనస్ పోందాలని ఆయన కోరారు.