News January 2, 2026
‘పొలం బాట’తో రైతుల విద్యుత్ కష్టాలకు చెక్: ఎస్ఈ

అన్నదాతల విద్యుత్ సమస్యల తక్షణ పరిష్కారమే లక్ష్యంగా చేపట్టిన ‘పొలం బాట’ కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోందని విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రీనివాస చారి తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 557 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి, వేలాడుతున్న వైర్లు మరియు వంగిన స్తంభాలను సరిచేసినట్లు పేర్కొన్నారు. విద్యుత్ ప్రమాదాల నివారణకు ఎత్తైన స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ గద్దెలను ఏర్పాటు చేశామన్నారు.
Similar News
News April 20, 2026
KMM: మొక్కజొన్న కొనుగోళ్లపై కలెక్టర్లకు మంత్రి తుమ్మల ఆదేశాలు

మొక్కజొన్న కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చోట అదనపు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మార్క్ఫెడ్ ద్వారా 200 కేంద్రాల్లో కొనుగోళ్లు కొనసాగుతున్నాయని తెలిపారు. కొనుగోలు చేసిన మొక్కజొన్నను వెంటనే గోదాములకు తరలించేలా చర్యలు తీసుకోవాలని మార్క్ఫెడ్ అధికారులను సూచించారు.

అందుబాటులోకి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే

జిల్లా ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే (ప్యాకేజీ-2) సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. వైరా మండలంలోని సోమవరం ఎగ్జిట్ పాయింట్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని దేవరపల్లి వరకు నిర్మించిన ఈ రహదారిని అధికారులు ప్రారంభించారు. నేటి నుంచి టోల్ వసూళ్లు మొదలయ్యాయి. కాగా, ఈ రహదారిపై ద్విచక్ర వాహనాలు, ఆటోలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.