News December 29, 2024
రాష్ట్రపతి భవన్‌లో JAN-2 నుంచి సందర్శకులకు ప్రవేశం

బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌లో జనవరి 2 నుంచి 13 వరకు సందర్శకులకు ప్రవేశం కల్పించనున్నారు. ఈసారి ఉద్యాన్ ఉత్సవ్ – పుష్పాలు, హార్టికల్చర్ పండుగను ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిర్వహించనున్నారు. సుమారు 50 స్టాల్‌తో గ్రాండ్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనున్నారు. సాయంత్రం 4గంటల నుంచి 8 గంటల వరకు వివిధ కళారూపాలను ప్రదర్శిస్తారు.
Similar News
News September 18, 2025
HYD: ఒకే రోజు.. ఒక్కో తీరు.. ఇదే విచిత్రం!

సెప్టెంబరు 17.. HYD చరిత్రలో ప్రత్యేకమైన రోజు.. నిజాం పాలనుంచి విముక్తి పొంది స్వేచ్ఛను పొందిన ప్రత్యేక సందర్భం. అయితే ఈ వేడుకను ఒక్కో పార్టీ ఒక్కో పేరుతో చేసుకుంది. అధికార పార్టీ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించగా.. ప్రతిపక్ష బీఆర్ఎస్ జాతీయ సమైక్యతా దినోత్సవం, బీజేపీ హైదరాబాద్ లిబరేషన్ డే పేరిట వేడుకలు జరిపాయి. వీరంతా కలిసి చేసింది ప్రజల విజయాన్నే!
News September 18, 2025
HYDలో ఉచిత బస్‌పాస్ ఇవ్వండి సీఎం సార్!

విద్యా వ్యవస్థను మార్చేద్దాం అని అధికారుల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన విషయం ఈ రోజు మీడియాలో ప్రముఖంగా వచ్చింది. అయితే ముందుగా విద్యార్థులకు ఉచిత బస్‌పాస్ ఇవ్వాలని పలువురు కోరుతున్నారు. విద్యార్థినులకు ఎలాగూ మహాలక్ష్మి సౌకర్యం ఉంది. ఎటొచ్చీ బాయ్స్‌కే ఈ సమస్య. రూ.కోట్లు ‘మహాలక్ష్మి’కి కేటాయిస్తున్న ప్రభుత్వం.. HYDలో కిక్కరిసి ప్రయాణించే స్టూడెంట్‌కు బస్‌పాస్ ఫ్రీగా ఇవ్వాలని కోరుతున్నారు.
News September 18, 2025
జూబ్లీహిల్స్ బరిలో బీజేపీ నాయకురాలు?

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో పోటీచేసేందుకు ఆశావహులు ఆయా పార్టీల్లో తీవ్ర ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి కొత్త పేరు బయటకు వచ్చింది. ఆ పార్టీ HYD నేత మాధవీలత పోటీచేసేందుకు ఆసక్తిచూపుతున్నారని సమాచారం. తాను పోటీచేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని, ఆ అదృష్టం దక్కాలని కోరుకుంటున్నానని బోరబండలో పేర్కొన్నారు. మాధవీలత గతంలో HYD ఎంపీ స్థానానికి పోటీచేసి పరాజయం పాలయ్యారు.