News January 4, 2026
GHMCలో పన్నుల లెక్క.. ఎవరి పవర్ ఎంత..?

GHMC పరిధిలో ఆస్తి పన్ను మదింపు అధికారుల అధికారాలపై స్పష్టత వచ్చింది. 10 వేల చదరపు అడుగుల లోపు విస్తీర్ణం ఉన్న భవనాల పన్ను వ్యవహారాలను డిప్యూటీ కమిషనర్లు పర్యవేక్షిస్తారు. అంతకు మించి విస్తీర్ణం ఉన్నా లేదా ఐదేళ్ల కంటే పాత బకాయిల సర్దుబాటు చేయాలన్నా నేరుగా జోనల్ కమిషనర్ అనుమతి తప్పనిసరి. చిన్నచిన్న మార్పులకు లోకల్ ఆఫీసర్ చేస్తారు కానీ పెద్ద ప్రాపర్టీల లెక్కలన్నీ జోనల్ స్థాయిలోనే తేలనున్నాయి.
Similar News
News April 20, 2026
కొడంగల్: CM ఇలాకాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో రూ.224 కోట్లతో 450 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. కాగా, రాష్ట్రంలోని పెద్ద సర్కార్ దవాఖానాలైన గాంధీ (2,000+ పడకలు), ఉస్మానియా (1,168+ పడకలు) తర్వాత, ప్రాంతీయ స్థాయిలో ఇంతటి ఆధునిక వైద్యశాల రావడం ఇదే తొలిసారి. ఈ భారీ నిర్మాణం పూర్తయితే కొడంగల్‌తో పాటు పరిసర జిల్లాలకు ఎంతో ఉపయోగపడనుంది.

HYDలో త్వరలో మరో IVF సెంటర్

HYD హైకోర్టు సమీపంలోని పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో త్వరలో IVF కేంద్రం అందుబాటులోకి రానుంది. గాంధీ ఆసుపత్రిలో IVF సెంటర్ సక్సెస్ అయిన నేపథ్యంలో ఇక్కడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు DME నరేందర్ కుమార్ తెలిపారు. సుమారుగా 490 పడకల సామర్థ్యంతో, డాక్టర్లతో అద్భుతమైన సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రెగ్నెన్సీ పరీక్షలు చేయడం, పసిపిల్లలకు వైద్యం, పిల్లల తల్లులకు అడ్వాన్స్డ్ వైద్యం అందించనున్నారు.