News February 12, 2026

రీసర్వే, పాస్‌పుస్తకాల పంపిణీ వేగవంతం చేయాలి: జేసీ

image

రీసర్వే పనులు, పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీని వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం జరిగిన వీసీలో రీస‌ర్వే, ప‌ట్టాదారు పాసుపుస్త‌కాల పంపిణీని స‌మీక్షించారు. పెండింగ్ ఖాతాలు త్వరగా క్లియర్ చేసి, మ్యూటేషన్లు వేగంగా చేయాలన్నారు. ఫిబ్ర‌వ‌రి నెల‌కు సంబంధించి ఇంకా 4,765 ఖాతాలు పెండింగ్ ఉండ‌టం ప‌ట్ల అసంతృప్తిని వ్య‌క్తం చేశారు.

Similar News

News March 10, 2026

విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్‌లో ACB అధికారుల సోదాలు

image

విజయనగరం నగరపాలక సంస్థ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో ACB అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. టౌన్ ప్లానింగ్ అధికారి రమణమూర్తితో పాటు పలువురు సిబ్బందిపై వచ్చిన అవినీతి ఫిర్యాదుల నేపథ్యంలో ఈ దాడులు నిర్వహించారు. సోదాల్లో కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అక్రమ లేఅవుట్లు, నిర్మాణ అనుమతుల్లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో లోతైన విచారణ చేపడుతున్నట్లు తెలుస్తోంది.

News March 10, 2026

రేపు విజయనగరంలో రెరా అవగాహన సదస్సు

image

AP RERA ఆధ్వర్యంలో విజయనగరంలోని హోటల్ ఎస్‌విఎన్ లేక్ ప్యాలస్‌లో సదస్సును నిర్వహిస్తున్నట్లు సంస్థ ఛైర్మన్ శివారెడ్డి తెలిపారు. రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత, వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం ఈ సదస్సును ఏర్పాటు చేశామన్నారు. బుధవారం ఉ.10కి జరిగే ఈ సదస్సులో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల రియల్ ఎస్టేట్ ప్రమోటర్లు, ఏజెంట్లు, ఇంజినీర్లు, ఆర్కిటెక్‌లు, కొనుగోలుదారులు పాల్గొని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News March 10, 2026

విజయనగరం జిల్లాలో విస్తృతంగా హెచ్‌పీవీ టీకాలు

image

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ కోసం జిల్లాలో హెచ్‌పీవీ టీకాల కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ 14 ఏళ్ల బాలికలకు ఈ టీకా ఇవ్వనున్నట్లు, ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ మూడు నెలలు కొనసాగుతుందని తెలిపారు. పాఠశాలలు, అంగన్‌వాడీల ద్వారా అర్హులైన బాలికలను గుర్తించి టీకాలు వేస్తామన్నారు.