News February 5, 2025
వరంగల్: క్వింటా పత్తి ధర రూ. 6,980
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం పత్తి ధర స్వల్పంగా పెరిగింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.7,000 పలకగా.. మంగళవారం రూ.6,960కి పడిపోయింది. అలాగే నేడు రూ.20 పెరిగి రూ.6,980 కి చేరినట్లు మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి నిర్మల తెలిపారు. గత వారం క్రమంగా పెరుగుతూ వచ్చిన పత్తి ధర ఇప్పుడు తగ్గుతుండటంతో రైతన్నలు ఆవేదన చెందుతున్నారు.
Similar News
News February 5, 2025
HYD: బాలికతో అసభ్య ప్రవర్తన.. వ్యక్తికి ఏడాది జైలు శిక్ష
బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన కిరణ్ అనే యువకుడికి ఎల్బీనగర్ ఫాస్ట్ ట్రాక్ కోర్డు ఏడాది జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. పోలీసుల వివరాలిలా.. సరూర్ నగర్ పరిధికి చెందిన కిరణ్ ఓ బాలికతో పరిచయం పెంచుకుని ప్రేమ పేరుతో వేధించాడు. ఈ ఘటన 2020లో జరగ్గా కేసు నమోదైంది. తాజాగా కోర్టు శిక్ష విధించింది.
News February 5, 2025
చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలు.. ఎస్పీ సూచనలు
చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ బుధవారం పరిశీలించారు. బందోబస్త్ ఏర్పాట్లను పర్యవేక్షణ చేసి, అధికారులకు పలు సూచనలు చేశారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బందోబస్తు నిర్వహించాలని అధికారులకు సూచించారు.
News February 5, 2025
ఢిల్లీలో కమలానికే పీఠం: చాణక్య స్ట్రాటజీస్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో BJPదే విజయమని చాణక్య స్ట్రాటజీస్ తెలిపింది. బీజేపీకి 39-44 సీట్లు వస్తాయని పేర్కొంది. ఆప్ 25-28 స్థానాలు దక్కించుకుంటుందని అంచనా వేసింది. కాంగ్రెస్‌కు 2-3 సీట్లు వచ్చే ఆస్కారముందని తెలిపింది. అలాగే పీపుల్స్ పల్స్ సర్వే బీజేపీ 51-60 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. ఆప్ 10-19 స్థానాలకే పరిమితమవుతుందని పేర్కొంది. కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాదని తెలిపింది.