News February 5, 2025
ఢిల్లీలో కమలానికే పీఠం: చాణక్య స్ట్రాటజీస్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో BJPదే విజయమని చాణక్య స్ట్రాటజీస్ తెలిపింది. బీజేపీకి 39-44 సీట్లు వస్తాయని పేర్కొంది. ఆప్ 25-28 స్థానాలు దక్కించుకుంటుందని అంచనా వేసింది. కాంగ్రెస్‌కు 2-3 సీట్లు వచ్చే ఆస్కారముందని తెలిపింది. అలాగే పీపుల్స్ పల్స్ సర్వే బీజేపీ 51-60 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. ఆప్ 10-19 స్థానాలకే పరిమితమవుతుందని పేర్కొంది. కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాదని తెలిపింది.
Similar News
News February 17, 2025
మరో 112 మందితో భారత్ చేరుకున్న US ఫ్లైట్

అక్రమంగా ప్రవేశించారని కొందరు భారతీయులను అమెరికా స్వదేశానికి పంపుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా US నుంచి అమృత్‌సర్‌కు 3వ సైనిక విమానం కొద్దిసేపటి కిందటే చేరుకుంది. ఇందులో 112 మంది వివిధ రాష్ట్రాల వాసులున్నారు. ఇప్పటికే 2 విమానాల్లో US అక్రమ వలసదారులను వెనక్కి పంపింది. మరోవైపు, ఈ విమానాలను అమృత్‌సర్‌లోనే ఎందుకు ల్యాండింగ్ చేస్తున్నారని పంజాబ్ CM కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు.
News February 17, 2025
‘ఛావా’ ఓటీటీ స్ట్రీమింగ్ ఎందులో అంటే?

విక్కీ కౌశల్, రష్మిక నటించిన ‘ఛావా’ FEB 14న రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది. ట్రైలర్ విడుదల నుంచే మూవీపై భారీ అంచనాలు ఏర్పడగా, అందుకు తగ్గట్లు నెట్‌ఫ్లిక్స్ పెద్ద మొత్తం చెల్లించి OTT రైట్స్ దక్కించుకున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. యావరేజ్ టాక్ వస్తే నెలకే స్ట్రీమింగ్ చేయాలనుకోగా, పాజిటివ్ టాక్‌తో 8వారాల తర్వాతే OTTలోకి వచ్చే అవకాశముంది. బాలీవుడ్‌లో ‘ఛావా’కు రూ.31cr బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి.
News February 17, 2025
రేపు ఢిల్లీ సీఎం ప్రకటన? ఎల్లుండి ప్రమాణం?

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి 8 రోజులు అవుతున్నా CM ఎవరనే దానిపై ఉత్కంఠ వీడటం లేదు. రేపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు JP నడ్డా అధ్యక్షతన ఆ పార్టీ శాసనసభా పక్షం సమావేశం కానుంది. ఈ భేటీలో CM, క్యాబినెట్ కూర్పుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేశ్ వర్మ CM రేసులో ఉన్నా, అశీష్ సూద్, రేఖా గుప్తా సహా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. రేపు ఎంపిక పూర్తైతే 18న ప్రమాణ స్వీకారం జరిగే ఛాన్సుంది.