News February 16, 2025

వరంగల్: మహాశివరాత్రికి ప్రత్యేక బస్సులు

image

మహా శివరాత్రి పురస్కరించుకొని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి పుణ్య క్షేత్రానికి వరంగల్ రీజియన్ నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. వరంగల్-1 డిపో నుంచి 21 బస్సులు, హనుమకొండ 27, మహబూబాబాద్ 30, నర్సంపేట 30, పరకాల 24 బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Similar News

News March 12, 2025

నిలిచిన SBI లావాదేవీలు.. కస్టమర్ల అసహనం

image

దేశ వ్యాప్తంగా SBI ఆన్‌లైన్ సేవలు బంద్ అయ్యాయి. UPI యాప్‌లో SBI అకౌంట్ నుంచి చేస్తున్న లావాదేవీలు నిలిచిపోయాయి. అలాగే SBI అకౌంట్ ఉన్న వారికి చేస్తున్న లావాదేవీలు సైతం ఫెయిల్ అవుతున్నాయి. నిన్న కూడా ఇలాంటి సమస్యే తలెత్తి యూజర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇవాళ కూడా మళ్లీ అదే తరహా సమస్య రావడంతో దేశంలో అతిపెద్ద బ్యాంక్‌పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. మీకూ ఇలాంటి సమస్యే ఎదురైందా? కామెంట్ చేయండి.

News March 12, 2025

చనిపోయిందనుకొని ఖననం చేస్తే.. చివరికి.!

image

మరణించిందని భావించి పూడ్చిపెట్టిన మహిళ తిరిగి లేచిన ఘటన USలో జరిగింది. 1915లో ఎస్సీ విలియమ్స్ మూర్ఛ వ్యాధితో చనిపోయిందనుకొని అంత్యక్రియలు కూడా పూర్తిచేశారు. అయితే, అంత్యక్రియలకు ఆలస్యంగా వచ్చిన తన సోదరి చివరి చూపు చూస్తానని శవపేటికను తెరవాలని కోరారు. దీంతో తవ్వి పేటిక తెరవగా ఆమె లేచి కూర్చొని నవ్వుతూ కనిపించారు. అది చూసిన వారంతా భయంతో పారిపోయారు. ఆ తర్వాత ఆమె మరో 47ఏళ్లు జీవించడం గమనార్హం.

News March 12, 2025

రెవెన్యూ అంశాలపై పట్టు పెంచుకొవాలి: కలెక్టర్

image

మచిలీపట్నం కలెక్టరేట్‌లో మీకోసం సమావేశ మందిరంలో బుధవారం జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ, డీఆర్‌ఓ కే చంద్రశేఖరరావు, కె ఆర్ ఆర్ సి. ఎస్.డి.సి శ్రీదేవితో కలిసి రెవెన్యూ అధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కార వేదిక పురోగతి, రీ సర్వే, గ్రామ, వార్డు సచివాలయాల సేవలు తదితర రెవెన్యూ అంశాలపై దిశానిర్దేశం చేశారు.

error: Content is protected !!