News February 16, 2026

విజయనగరం కలెక్టరేట్‌కు 259 వినతులు

image

కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మొత్తం 259 వినతులు అందాయి. వీటిలో 166 పీజీఆర్ఎస్‌కు, 93 రెవెన్యూ క్లినిక్‌కు వచ్చాయి. డీఆర్ఓ మురళి, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు వెంకటేశ్వరరావు, రాజేశ్వరి, కళావతి, నూకరాజు, బి. శాంతి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అర్జీలను నిర్ణీత గడువులో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News March 17, 2026

విజయనగరం RDOగా సుధాసాగర్

image

రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖలో బదిలీలు చేపట్టింది. విశాఖలోని HPCLలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (SDC-LA)గా పనిచేస్తున్న సనపాల సుధాసాగర్‌ను విజయనగరం RDOగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్ పరీక్షల్లో అవకతవలు జరిగాయంటూ కోర్టులో పిటిషన్ దాఖలు కాగా.. కేసు తేలేవరకు ఆ బ్యాచ్‌ అధికారులందరినీ బదిలీ చేయాలని న్యాయస్థానం తీర్పు మేరకు విజయనగరం RDO దాట్ల కీర్తీని బదిలీ చేసిన విషయం తెలిసిందే.

News March 17, 2026

VZM: ‘ఉగాది ఉత్సవాలు విజయవంతం చేయాలి’

image

ఈనెల 19న శ్రీ మన్నార్ రాజగోపాలస్వామి దేవాలయంలో నిర్వహించనున్న ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించాలని డీఆర్వో సి.హెచ్.సత్తిబాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం తన ఛాంబర్‌లో సమీక్ష నిర్వహించారు. నాదస్వరం, వేదపండితుల ఆశీర్వచనం, పంచాంగ శ్రవణం, పండిత సత్కారం, ప్రసాదాల పంపిణీ వంటి కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమిష్టిగా కృషి చేయాలన్నారు.

News March 17, 2026

VZM: 22న బాడీ బిల్డర్స్ పోటీలు

image

యువత డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని జిల్లా బాడీ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శంకరరావు పిలుపునిచ్చారు. పట్టణంలోని రాజీవ్ క్రీడా మైదానంలో మంగళవారం మాట్లాడారు. 22న గురజాడ కళాభారతిలో “మిస్టర్ VZM-2026” బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. 55 నుంచి 75 కేజీల వరకు 6 కేటగిరీల్లో పోటీలు జరగనున్నాయన్నారు. మత్తు పదార్థాలపై అవగాహన కల్పించేందుకే పోటీలు నిర్వహిస్తునమన్నారు.