News October 18, 2024
శ్రీకాకుళం: ఇద్దరిని హత్య చేసి, వ్యక్తి సూసైడ్

శ్రీకాకుళం జిల్లా వాసులు ముగ్గురు బెంగళూరులో మృతి చెందారు. పోలీసుల కథనం..గొల్లబాబు(45), లక్ష్మి పైతమ్మ (40) భార్యాభర్తలు బెంగళూరులో భవన నిర్మాణ కార్మికులుగా ఉన్నారు. వీరితో పాటు గణేశ్ (20) ఓ బిల్డింగ్లో పనికి దిగారు. గణేశ్తో పైతమ్మకు వివాహేతర సంబంధం ఉందని గొల్లబాబు బుధవారం రాత్రి ఇరువురిని హత్య చేశాడు. గురువారం ఉదయం అతను ఉరేసుకుని చనిపోయాడు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు డీసీపీ లోకేశ్ తెలిపారు.
Similar News
News November 18, 2025
శ్రీకాకుళం: స్టాప్ మీటింగ్లో కుప్ప కూలిన అధ్యాపకుడు

శ్రీకాకుళం ప్రభుత్వ బాలుర కళాశాల తెలుగు అధ్యాపకుడు పప్పల వెంకటరమణ మంగళవారం కళాశాలలో స్టాప్ మీటింగ్ జరుగుతుండగా కుప్ప కూలిపోయాడు. మీటింగ్లో ఒక్కసారిగా కింద పడిపోవటంతో స్పందించిన తోటి అధ్యాపకులు శ్రీకాకుళంలోని డే అండ్ నైట్ సమీపంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వెంకటరమణ పొందూరు మండలం ధర్మపురం కాగా, శ్రీకాకుళంలోని PM కాలనీలో నివాసం ఉంటున్నారు.
News November 18, 2025
గుప్పిడి పేట: సముద్రంలో తెప్ప బోల్తాపడి మత్స్యకారుడు మృతి

సముద్రంలో తెప్ప బోల్తా పడడంతో మంగళవారం ఉదయం గుప్పిడిపేటకు చెందిన మత్స్యకారుడు మృతి చెందాడు. పోలాకి మండలం గుప్పిడిపేట నుంచి ముగ్గురు మత్స్యకారులతో వేటకు బయలుదేరిన చెక్క రాజయ్య (45) తెప్పపై సముద్రంలోకి వెళుతుండగా బోల్తా పడి మునిగి మృతి చెందాడు. స్థానికులు మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకువచ్చారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.