News October 30, 2024
శ్రీకాకుళం: ఈదుపురంలోనే సీఎం చంద్రబాబు సభ
సీఎం చంద్రబాబు ఇచ్ఛాపురం మండలం ఈదుపురంలో నవంబర్ 1న పర్యటించనున్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించనున్నారు. జిల్లా పర్యటనకు సీఎం రానున్న నేపథ్యంలో మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆ గ్రామానికి చేరుకొని టెక్కలి ఆర్డీవోతో కలిసి, పలు వీధుల్లో పర్యటించారు. సభాస్థలి ప్రదేశాన్ని, గ్రామ పరిసరాలను మరోసారి పరిశీలించి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.
Similar News
News October 30, 2024
శ్రీకాకుళంలో అత్యధికంగా మహిళా ఓటర్లు
ముసాయిదా ఓటరు జాబితా రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి 8 నియోజకవర్గాల్లో అత్యధికంగా మహిళా ఓటర్లు ఉన్న నియోజకవర్గంగా శ్రీకాకుళం ఉంది. నియోజకవర్గం మొత్తం 2,73,364 మంది ఓటర్ల ఉండగా అందులో 1,38,020 మంది మహిళా ఓటర్ల ఉన్నారు. ఈ నియోజకవర్గంలో 279 పోలింగ్ కేంద్రాలను నియమించారు.
News October 30, 2024
బూర్జ: బాలికకు వేధింపులు.. పోక్సో కేసు నమోదు
విజయవాడలో చదువుకుంటున్న బూర్జ మండలం సుంకరపేటకు చెందిన విద్యార్థినికి వేధింపుల విషయంలో కేసు నమోదైంది. పోలీసుల వివరాల మేరకు.. 9వ తరగతి విద్యార్థిని(14)పై మేనమామ వరసైన సూరిబాబు మాయమాటలతో 2022లో అత్యాచారం చేయగా, పెద్దలు వివాహం చేశారు. రెండేళ్లు గడవకముందే అత్తమామలు, భర్త వేధించడంతో పోలీసులను ఆశ్రయించింది. బాలికకు పదహారేళ్లు కావడంతో విజయవాడ గుణదల పోలీసులు పోక్సో, అత్యాచారం కేసు నమోదు చేశారు.
News October 30, 2024
శ్రీకాకుళం: ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లకు పోస్టింగ్
రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన డిప్యూటీ కలెక్టర్ల పోస్టింగ్లలో జిల్లాకు ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం నియమించిందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వీరిలో పలాస రెవెన్యూ డివిజినల్ అధికారిగా వెంకటేశ్వర్లును నియమించిందన్నారు. కలెక్టరేట్ KRRC విభాగం అధిపతిగా పద్మావతిని నియమించారని తెలిపారు. లావణ్యను BRR వంశధార ప్రాజెక్టు భూ సేకరణధికారిగా నియమించారని ఆ ప్రకటనలో తెలిపారు.