News May 23, 2024

శ్రీకాకుళం: ఐటీఐలో 550 ఉద్యోగాలతో జాబ్ మేళా

image

ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐలో నేడు జాబ్ మేళా నిర్వహించనున్నారు. 18-35 వయసు గల అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. ఈ మేళాలో 550 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. టెన్త్, ఐటీఐ ఒరిజినల్ పత్రాలు, ఆధార్ కార్డుతో పాటు బయోడేటా జిరాక్స్ కాపీలు 2 సెట్లు, పాస్‌పోర్టు సైజు ఫోటోలతో ఉ. 9 గంటలకు హాజరు కావాలాని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని సూచించారు.

Similar News

News October 14, 2025

SKLM: ‘దాన్యం సేకరణ ప్రణాళికతో జరగాలి’

image

రైతులకు ఎటువంటి ఇబ్బందిలేకుండా ముందస్తు ప్రణాళికతో ధాన్యం సేకరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. నేడు కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల, డివిజన్ స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రి మనోహర్, కమీషనర్, MD సూచనలు అనుసరించి రైతులు దగ్గర నుంచి దాన్యం కొనుగోలు చేయాలన్నారు.

News October 13, 2025

శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

image

➧కల్తీ మద్యం వ్యవహారంపై జిల్లాలో పలు చోట్ల వైసీపీ నిరసన
➧ బాలీయాత్రపై సీఎం చంద్రబాబుకు వివరించాం: ఎమ్మెల్యే కూన
➧ కొత్తూరు: నీట మునిగిన పంటను పరిశీలించిన అధికారులు
➧వజ్రపుకొత్తూరు: విద్యాబుద్ధులు నేర్పిన బడిలోనే..టీచర్‌గా చేరింది
➧ ఎస్పీ గ్రీవెన్స్‌కు 50 వినతులు
➧శ్రీకాకుళం: 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం
➧టెక్కలి: ఆర్టీసీ బస్సులో సీటు కోసం మహిళల గొడవ

News October 13, 2025

ఎచ్చెర్ల: RBK నిర్మాణంపై కలెక్టర్ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు

image

ఎచ్చెర్ల మండలం, బడివానిపేట గ్రామంలో నిర్మించ తలపెట్టిన RBK కేంద్రంతో చిన్నపిల్లలు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సోమవారం జడ్పీ సమావేశ మందిరంలో జరిగిన గ్రీవెన్స్‌లో ఫిర్యాదు అందింది. గ్రామస్థులు ఈ సమస్యను అధికారులకు వివరించారు. నిర్మాణంలో భాగంగా పిల్లర్స్ వేసి ఉంచడంతో 48 మంది కుటుంబాలకు చెందిన పిల్లలు అక్కడ ఆడుకుంటారని, దీంతో ప్రమాదాలు చేసుకుంటున్నాయని తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.