News July 6, 2024

శ్రీకాకుళం: ఒక్కొక్కరిగా ఆస్పత్రిపాలవుతున్న విద్యార్థులు

image

కోటబొమ్మాలి కేజీబీవీ పాఠశాల విద్యార్థులు గత 2రోజులుగా ఒక్కొక్కరిగా తీవ్ర అస్వస్థతకు గురై ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. శనివారం రాత్రి వరకు పాఠశాలలో చదువుతున్న 20మంది విద్యార్థులకు తీవ్రంగా వాంతులు, విరేచనాలయ్యి ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం 12 మంది విద్యార్థులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News October 19, 2025

అనుమతి లేని బాణసంచా విక్రయాలపై కఠిన చర్యలు: ఎస్పీ

image

ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా బాణసంచా సామాగ్రిని విక్రయించినా, నిల్వ ఉంచినా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ప్రజలు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా, ఆనందంగా దీపావళి జరుపుకోవాలని సూచించారు. లైసెన్స్ ఉన్న షాపుల యజమానులు మాత్రమే అమ్మకాలు జరపాలని, కాలుష్య రహిత క్రాకర్స్‌ను వినియోగిస్తే మంచిదని ఆయన తెలిపారు.

News October 18, 2025

ఎచ్చెర్ల: డిగ్రీ 5వ సెమిస్టర్ షెడ్యూల్ విడుదల

image

డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ ఐదవ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్‌ను యూనివర్సిటీ డీన్ శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పరీక్ష ఫీజులను ఎటువంటి అపరాధ రుసుము లేకుండా అక్టోబర్ 31వ తేదీ వరకు సంబంధిత కళాశాలల్లో చెల్లించవచ్చని తెలిపారు. ఈ పరీక్షలు నవంబర్ చివరి వారంలో జరుగుతాయని వెల్లడించారు.

News October 18, 2025

బాణసంచా దుకాణాల వద్ద జాగ్రత్తలు తప్పనిసరి: కలెక్టర్

image

బాణసంచా దుకాణాల వద్ద పటిష్ట భద్రత, జాగ్రత్తలు తప్పనిసరిగా చేపట్టాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు. శనివారం సాయంత్రం టెక్కలిలో పర్యటించిన ఆయన ముందుగా దీపావళి సామాగ్రి దుకాణాలను పరిశీలించారు. అనంతరం టెక్కలిలో జరుగుతున్న స్పెషల్ శానిటేషన్ పనులను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఈయనతో పాటు ఆర్డీఓ కృష్ణమూర్తి, తహశీల్ధార్ సత్యం, ఎంపీడీఓ రేణుక, ఈఓ శ్రీనివాసరావు తదితరులున్నారు.