News December 17, 2024
శ్రీకాకుళం: పోలీసులపై దాడి.. నిందితుల అరెస్టు
శ్రీకాకుళం జిల్లా పోలీసులపై ఈ నెల 12వ తేదీ రాత్రి రాజమండ్రిలో కొంత మంది వ్యక్తులు దాడి చేసి ఒక కేసులో ముద్దాయి రాపాక ప్రభాకర్(ప్రతాప్ రెడ్డి)ని తీసుకువెళ్లిన ఘటన తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి పోలీసులపై దాడికి పాల్పడిన భీమవరం, రాజమండ్రి ప్రాంతాలకు చెందిన 12 మందిని రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు మంగళవారం అడిషనల్ ఎస్పీ సుబ్బరాజు, డీఎస్పీ రమేష్ బాబు వివరాలు వెల్లడించారు.
Similar News
News December 18, 2024
హ్యాపీ బర్త్ డే రామ్మోహన్ నాయుడు
రామ్మోహన్ నాయుడు.. తండ్రికి తగ్గ తనయుడిగా పేరొందారు. బుల్లెట్ లాంటి మాటలు, సబ్జెక్ట్పై పట్టు, క్రమ శిక్షణతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 26ఏళ్లకే పార్లమెంట్కు ఎన్నికై అనతి కాలంలోనే తన మార్క్ చూపించారు. పార్లమెంట్లో అనర్గళంగా మాట్లాడుతూ ఎంతో మంది ప్రశంసలు పొందారు. గత ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం అందుకున్న ఆయన కేంద్ర మంత్రి అయ్యారు. చిన్న వయసులో ఆ పదవి పొందిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు.
News December 18, 2024
కోటబొమ్మాలి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
శ్రీకాకుళం జిల్లాలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. కోటబొమ్మాలి నుంచి టెక్కలి వైపు స్కూటీపై మహిళ వెళ్తుండగా పాకివలస వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. టెక్కలి వైపు నుంచి నరసన్నపేట వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొని, పక్క రోడ్డులో వెళ్తున్న మహిళను ఢీకొంది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కారులో ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
News December 18, 2024
శ్రీకాకుళం: నేటి నుంచి డిపార్ట్మెంటల్ పరీక్షలు
శ్రీకాకుళం జిల్లాలో నేటి నుంచి 23 వరకు నిర్వహించనున్న డిపార్ట్మెంట్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇన్ఛార్జ్ DRO అప్పారావు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఈ పరీక్షలు రాసేందుకు 1831 మంది అర్హత పొంది ఉన్నట్టు ఆయన తెలిపారు. జిల్లాలో 3 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎచ్చెర్ల శివాని ఇంజినీరింగ్ కళాశాల, వెంకటేశ్వర ఇంజినీరింగ్, నరసన్నపేటలో కోర్ టెక్నాలజీలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.