News July 1, 2024
శ్రీకాకుళం: 25,760 మంది ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలు

శ్రీకాకుళం జిల్లాలో 30 మండలాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ 1, 2 సంవత్సరం చదువుతున్న 25,760 మంది విద్యార్థులకు ఉచిత పుస్తకాలు పంపిణీ చేయనున్నామని డివైఈవో శివ్వాల తవిటినాయుడు ఆదివారం తెలిపారు. జిల్లాలో 38 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, 13 మోడల్ స్కూల్ కాలేజీలు, 25 కేజీబీవీలు, 9 సోషల్ వెల్ఫేర్, 12 హైస్కూల్ ప్లస్, ఒక్కొక్క ఎస్టి, మహాత్మ జ్యోతిబాయి పూలే రెసిడెన్షియల్ కాలేజీలు ఉన్నాయి.
Similar News
News November 7, 2025
శ్రీకాకుళం: జిల్లా వ్యవసాయ అధికారిగా మనోహర్

జిల్లా వ్యవసాయ అధికారిగా మనోహర్ ప్రసాద్ గురువారం నూతనంగా బాధ్యతలు చేపట్టారు. జిల్లా వ్యవసాయ కార్యాలయంలో జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ పూజారి సత్యనారాయణ, వ్యవసాయ శాఖ అధికారులు ఆయనను కలిసి అభినందించారు. వ్యవసాయ శాఖ సేవలు రైతులకు అందించడం లక్ష్యంగా పని చేస్తానని ఆయన అన్నారు. ప్రభుత్వ పథకాలు రైతులకు చేర్చడం, లాభసాటి వ్యవసాయ పద్ధతులు అమలు లక్ష్యంగా వివరించారు.
News November 6, 2025
ఏపీలో కొత్తగా 2 జిల్లాలు..మరి పలాస..?

APలో కొత్తగా మదనపల్లె, మార్కాపురం 2 జిల్లాలతో పాటు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. గతంలో పలాసను జిల్లాగా మార్చాలన్నా ప్రతిపాదనను పాలకులు పట్టించుకోలేదు. పునర్విభజనను కూటమి మళ్లీ తెరపైకి తేగా..నిన్న జరిగిన మంత్రి వర్గ ఉపసంఘం సమావేశంలో ప్రస్తావించకపోవడం ఉద్దానం వాసుల ఆశలను నీరుగార్చారు. మరో 2 రోజుల్లో రానున్న నివేదికలోనైనా తమ ప్రాంతం పేరు రావాలని ప్రాంతవాసులు ఎదురుచూస్తున్నారు.
News November 6, 2025
SKLM: ఈ నెల 11న ఉద్యోగులకు జిల్లా స్థాయి క్రీడా ఎంపికలు

శ్రీకాకుళం జిల్లాలోని సివిల్ సర్వీసెస్ ప్రభుత్వ ఉద్యోగుల (పురుషులు, మహిళలు) కోసం జిల్లా స్థాయి క్రీడా ఎంపికలను నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి మహేశ్ బాబు బుధవారం తెలిపారు. నవంబర్ 11న కోడి రామ్మూర్తి స్టేడియం, ఆర్ట్స్ కాలేజీలో మొత్తం 19 క్రీడాంశాల్లో ప్రతిభావంతులను ఎంపిక చేస్తారన్నారు.ఉద్యోగులు తమ డిపార్ట్మెంట్ గుర్తింపు కార్డుతో స్టేడియం వద్ద హాజరుకావాలన్నారు.


