News March 9, 2025
సూర్యాపేట: అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ..!

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ పేరు ఖరారు చేస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్సీ కోటాలో ఆయన పేరును ఫైనల్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పేరు ప్రకటించడంపై ఆయన అభిమానులు, సన్నిహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News March 10, 2025
ఇక నుంచి ‘కొమురవెళ్లి పుణ్యక్షేత్రం’ రైల్వే స్టేషన్

మనోహరాబాద్- కొత్తపల్లి నుంచి హైదరాబాద్ వరకు వేస్తున్న కొత్త రైల్వే పనులు త్వరలో పూర్తి కానున్నాయి. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయ రైల్వే జంక్షన్‌కు ‘కొమురవెల్లి పుణ్యక్షేత్రం’ అని నామకరణం చేసింది. ఈ మేరకు రైల్వే శాఖ విడుదల చేసిన ఉత్తర్వుల్లో మరో మూడు స్టేషన్‌లు గుర్రాలగొంది, చిన్నలింగపూర్, సిరిసిల్ల పేర్లను లిస్టులో పెట్టారు.
News March 10, 2025
ప్రణయ్ హత్య కేసు: ఒకరికి ఉరిశిక్ష, మిగిలిన వారికి జీవిత ఖైదు

TG: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసు నిందితులకు కోర్టు శిక్ష విధించింది. ఏ2గా ఉన్న సుభాష్‌కు ఉరిశిక్ష, మిగిలిన ఆరుగురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ఏ1గా ఉన్న అమృత తండ్రి మారుతీ రావు 2020లో ఆత్మహత్య చేసుకున్నారు. 2018లో మిర్యాలగూడలో అమృతతో కలిసి వెళ్తోన్న ప్రణయ్‌ను సుభాష్ శర్మ కత్తితో నరికి చంపాడు.
News March 10, 2025
అధికారిక లాంఛనాలతో గరిమెళ్ల అంత్యక్రియలు

AP: టీటీడీ ఆస్థాన గాయకులు, ప్రముఖ సంగీత విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తిరుపతిలోని స్వగృహంలో ఆయన నిన్న గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. గరిమెళ్ల ఇద్దరు కుమారులు అమెరికా నుంచి మంగళవారం తిరుపతి చేరుకోనున్నారు. దీంతో ఆయన అంత్యక్రియలను రేపు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.