News March 10, 2025

ప్రణయ్ హత్య కేసు: ఒకరికి ఉరిశిక్ష, మిగిలిన వారికి జీవిత ఖైదు

image

TG: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసు నిందితులకు కోర్టు శిక్ష విధించింది. ఏ2గా ఉన్న సుభాష్‌కు ఉరిశిక్ష, మిగిలిన ఆరుగురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ఏ1గా ఉన్న అమృత తండ్రి మారుతీ రావు 2020లో ఆత్మహత్య చేసుకున్నారు. 2018లో మిర్యాలగూడలో అమృతతో కలిసి వెళ్తోన్న ప్రణయ్‌ను సుభాష్ శర్మ కత్తితో నరికి చంపాడు.

Similar News

News January 18, 2026

ఇరాన్ నిరసనల్లో 16,500 మంది మృతి?

image

ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో భారీగా మరణాలు నమోదైనట్లు తెలుస్తోంది. ‘ఇప్పటిదాకా 16,500-18000 మంది ఆందోళనకారులు చనిపోయారని డాక్టర్లు చెబుతున్నారు. 3.6 లక్షల మంది వరకు గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది 30 ఏళ్ల లోపు వారే’ అని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. అధికారులు మిలిటరీ ఆయుధాలు వాడుతున్నారని, నిరసనకారుల తల, మెడ, ఛాతీ భాగాల్లో బుల్లెట్ గాయాలు ఉన్నాయని ఓ ప్రొఫెసర్ చెప్పినట్లు తెలిపింది.

News January 18, 2026

APPLY NOW: SAILలో ఉద్యోగాలు

image

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (<>SAIL<<>>)కు చెందిన బర్న్‌పుర్ హాస్పిటల్‌లో 22కన్సల్టెంట్స్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి MBBS, పీజీ డిప్లొమా/పీజీ డిగ్రీ/DNB/DM/MCh/DrNB/DIH అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. జనవరి 20, 21 తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://sailcareers.com/

News January 18, 2026

అరటి పండ్ల విషయంలో గొడవ.. హిందూ వ్యాపారిని కొట్టిచంపారు!

image

బంగ్లాదేశ్‌లో మరో హిందువు హత్యకు గురయ్యాడు. ‘ఘాజీపూర్‌లో లిటన్ చంద్ర ఘోష్ (55) హోటల్ నిర్వహిస్తున్నాడు. మాసుమ్ మియాకు అరటి తోట ఉంది. ఈ క్రమంలో తమ అరటి పండ్లను ఎవరో ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేశాడు. లిటన్ హోటల్ వద్ద అవి కనిపించడంతో మాసుమ్‌, అతడి తల్లిదండ్రులు స్వాపన్, మాజేదా వాగ్వాదానికి దిగారు. విచక్షణారహితంగా కొట్టడంతో లిటన్ చనిపోయాడు. ముగ్గురినీ అరెస్టు చేశాం’ అని పోలీసులు తెలిపారు.