News August 13, 2025
అంగన్‌వాడీల్లో ఆధునిక బోధన అవసరం: కలెక్టర్

అంగన్‌వాడీ సెంటర్లలో ఆధునిక బోధనా పద్ధతులు అనుసరించడం అత్యవసరమని అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ అన్నారు. బుధవారం అమరావతి సచివాలయం నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ సూర్యకుమారి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ విషయం వెల్లడించారు. అంగన్‌వాడీల్లో ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని ఆయన సూచించారు.
Similar News
News August 14, 2025
రజినీకాంత్ ‘కూలీ’ పబ్లిక్ టాక్

భారీ అంచనాల మధ్య రజినీకాంత్ ‘కూలీ’ మూవీ థియేటర్లలో విడుదలైంది. USలో ప్రీమియర్లు చూసిన సినీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. రజినీ మాస్ అండ్ పవర్‌ఫుల్ డైలాగులతో మూవీ అదిరిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. నాగార్జున కీలక పాత్రలో కనిపిస్తారని చెబుతున్నారు. ఇక ఇప్పటికే వైరల్ అయిన పూజా హెగ్డే-సౌబిన్ షాహిర్ ‘మోనికా’ సాంగ్‌కు థియేటర్లలో పూనకాలేనని అంటున్నారు. కాసేపట్లో WAY2NEWS రివ్యూ.
News August 14, 2025
మున్నేరు ఉప్పొంగడంతో రాకపోకలు బంద్

ముదిగొండ మండలం పరిధిలోని పండ్రేగుపల్లి నుంచి రామకృష్ణాపురం దారిలో మున్నేరు నది పొంగిపొర్లుతోంది. దీంతో ఆ దారిలో రాకపోకలు నిలిచిపోయాయి. వరద ప్రవాహం ఎక్కువగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గ్రామ పంచాయతీ కార్యదర్శి తులసీరామ్ తెలిపారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించడంతో ప్రజల భద్రతకు తాము పర్యవేక్షిస్తున్నామని ఆయన వెల్లడించారు.
News August 14, 2025
ఖమ్మం జిల్లా నేటి వార్తా సమాచారం

☆ జిల్లాలో నేడు విద్యాసంస్థలకు సెలవు
☆ జిల్లాలో నేడు మంత్రి పొంగులేటి పర్యటన
☆ ఎర్రుపాలెంలో డిప్యూటీ సీఎం పర్యటన రద్దు
☆ నేడు జిల్లాకు అత్యంత భారీ వర్ష సూచన
☆ ఇవాళ వివిధ శాఖల అధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష
☆ జిల్లావ్యాప్తంగా ఇవాళ గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లు
☆ భారీ వర్షాలకు ఉప్పొంగుతున్న వాగులు, వంకలు
☆ ఖమ్మంలో మున్సిపల్ కమిషనర్ పర్యటన
☆ ఖమ్మం రూరల్ మారెమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు