News August 14, 2025

రజినీకాంత్ ‘కూలీ’ పబ్లిక్ టాక్

image

భారీ అంచనాల మధ్య రజినీకాంత్ ‘కూలీ’ మూవీ థియేటర్లలో విడుదలైంది. USలో ప్రీమియర్లు చూసిన సినీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. రజినీ మాస్‌ అండ్ పవర్‌ఫుల్ డైలాగులతో మూవీ అదిరిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. నాగార్జున కీలక పాత్రలో కనిపిస్తారని చెబుతున్నారు. ఇక ఇప్పటికే వైరల్ అయిన పూజా హెగ్డే-సౌబిన్ షాహిర్ ‘మోనికా’ సాంగ్‌కు థియేటర్లలో పూనకాలేనని అంటున్నారు. కాసేపట్లో WAY2NEWS రివ్యూ.

Similar News

News April 19, 2026

గుంటూరులో నేడు బంగారం ధర ఎంతంటే?

image

అక్షయ తృతీయ కావడంతో గుంటూరు జిల్లాలో బంగారు దుకాణాలు కొనుగోలుదారులతో కళకళలాడుతున్నాయి. గుంటూరులో ఆదివారం 10 గ్రాముల బంగారం 24 క్యారెట్ రూ. 1,57,934 పలుకుతోంది. 22 క్యారెట్ 10 గ్రాములు రూ. 1,43,600 చొప్పున విక్రయిస్తున్నారు. వెండి గ్రాము రూ. 263గా ఉంది. అక్షయ తృతీయలో కనీసం గ్రాము బంగారమైనా కొనాలని పలువురు ఆసక్తి చూపుతున్నారు.

News April 19, 2026

తమిళనాడులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం

image

AP CM చంద్రబాబు తమిళనాడులో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. NDA అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఈ నెల 20, 21వ తేదీల్లో అక్కడ పర్యటించనున్నారు. కోయంబత్తూరు, హోసూరు, చెన్నై, ఆవడి ప్రాంతాల్లో ప్రచారంలో పాల్గొంటారు. తెలుగు ప్రజలు అధికంగా ఉండే ప్రాంతాల్లోనే CBN ప్రచారం సాగనుంది. ఈ సందర్భంగా ఆయన బహిరంగ సభలు, రోడ్డు షోలలో పాల్గొననున్నారు. TNలో ఏప్రిల్ 23వ తేదీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

News April 19, 2026

PM మోదీ ప్రోత్సాహం నాకు బలం: పవన్

image

AP: తన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న <<19688324>>PM మోదీకి<<>> Dy.CM పవన్ ధన్యవాదాలు తెలిపారు. ‘నాతో మాట్లాడేందుకు సమయం కేటాయించిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు. త్వరగా కోలుకోవాలని మీరు తెలిపిన విషెస్, మీరిచ్చే ప్రోత్సాహం నాకు గొప్ప బలాన్నిస్తాయి. మీ మద్దతు, మార్గదర్శకత్వానికి కృతజ్ఞుడినై ఉంటా’ అని పవన్ ట్వీట్ చేశారు. పవన్ త్వరగా కోలుకోవాలని CM CBN, మంత్రి లోకేశ్, మాజీ సీఎం జగన్, KTR తదితరులు Xలో పోస్టులు పెట్టారు.