News April 10, 2026

అచ్చెన్న వ్యాఖ్యలతో ఉత్తరాంధ్రలో హిటేక్కిన రాజకీయం

image

YS రాజశేఖర్ రెడ్డి మరణంపై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలతో ఉత్తరాంధ్రలో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. YSR మృతి వెనుక జగన్ హస్తం ఉందని బొత్స గతంలో అనుమానం వ్యక్తం చేశారని అనడంతో దుమారం రేగింది. అచ్చెన్న వ్యాఖ్యలను బొత్స కండిస్తూ కన్నీరు పెట్టుకున్నారు. మావిగాన్ నిర్ణయంతో జగన్ జోకర్‌గా మిగిలారని షర్మిలా చేసిన వ్యాఖ్యలకు YCP MLC వరుదు కళ్యాణి స్పందిస్తూ ఆమె TDPకి అమ్ముడుపోయారని విమర్శించారు.

Similar News

News April 20, 2026

శ్రీకాకుళం: పద్మ పురస్కారాలకి నామినేషన్ల ఆహ్వానం

image

పద్మ పురస్కారాలకి నామినేషన్ల ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 31 వరకు ఆన్‌లైన్‌లో వివరాలు https://awards.gov.inలో నమోదు చేసుకోవాలన్నారు.
జిల్లాలోని వివిధ రంగాలకు చెందిన ప్రతిభావంతులు, నిస్వార్థ సేవకుల నుంచి 2027 సంవత్సరపు ‘పద్మ’ పురస్కారాలకు ప్రతిపాదనలు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు.

శ్రీకాకుళం: ఇంటర్మీడియట్ ఫెయిలైన వారికి గమనిక

image

ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ ఏడాది ఫీజుల స్వీకరణ సోమవారం నుంచి ప్రారంభమైనట్లు శ్రీకాకుళం ఆర్ఐఓ ఆర్. సురేశ్ కుమార్ తెలిపారు. ఈ నెల 27 లోపు ఫీజులు చెల్లించాలన్నారు. ఫెయిలైన వారు, మొదటి ఏడాది, రెండో ఏడాది ఇంప్రూవ్మెంట్ పరీక్ష రాసేవారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ద్వితీయ సంవత్సరం ఇంప్రూవ్మెంట్ రాసేందుకు ఈ ఏడాది కొత్తగా అవకాశం కల్పించినట్లు చెప్పారు.