News April 22, 2025
అనకాపల్లి: ‘ఆధునిక సాంకేతికతను వినియోగించాలి’

నేరాలు నియంత్రణకు ఆధునిక సాంకేతికతను వినియోగించాలని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి సూచించారు. రేంజ్ కార్యాలయంలో నిర్వహించిన క్రైమ్ సమీక్షలో అనకాపల్లి ఎస్పీ తుహీన్ సిన్హా పాల్గొన్నారు. ప్రజలు సైబర్ మోసాల బారిన పడకుండా ఉండేందుకు ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్ 1930 ప్రజలు వినియోగించుకునే విధంగా చూడాలన్నారు. డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయాలన్నారు.
Similar News
News April 23, 2025
HYD: OUలో వన్ టైం ఛాన్స్ పరీక్ష ఫీజుకు అవకాశం

OU పరిధిలోని డిగ్రీ కోర్సులకు వన్ టైమ్ ఛాన్స్ పరీక్షా ఫీజులు స్వీకరిస్తున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీఎస్‌డబ్ల్యూ తదితర కోర్సుల అన్ని సెమిస్టర్ల వన్ టైం ఛాన్స్ పరీక్షా ఫీజును వచ్చే నెల 19 వరకు చెల్లించవచ్చని చెప్పారు. రూ.500 అపరాధ రుసుంతో 29 వరకు చెల్లించే అవకాశం ఉందన్నారు. పూర్తి వివరాలకు www.osmania.ac.in ను చూడాలన్నారు.
News April 23, 2025
రాజశేఖర్‌కు మే 6 వరకు రిమాండ్

AP: మద్యం కుంభకోణం ఆరోపణల కేసులో కసిరెడ్డి రాజశేఖర్‌కు ఏసీబీ కోర్టు మే 6 వరకు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో ఆయనను పోలీసులు విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. ఈ కేసులో మొత్తం 29 మందిని సిట్ నిందితులుగా చేర్చింది. A1గా రాజశేఖర్‌ను పేర్కొంది. ఈ మేరకు కోర్టులో మెమో దాఖలు చేసింది.
News April 23, 2025
నేడే రిజల్ట్.. అనంతపురం జిల్లా విద్యార్థుల ఎదురుచూపు

పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. నేడు ఉదయం 10 గంటలకు మంత్రి నారా లోకేశ్ ఫలితాలను విడుదల చేయనున్నారు. అనంతపురం జిల్లాలో 32,803 మంది విద్యార్థులు ఉన్నారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.