News March 12, 2026
అనకాపల్లి జిల్లాలో వినూత్న కార్యక్రమం.. సీఎం ప్రశంసలు

అనకాపల్లి జిల్లాలో 114 ప్రభుత్వ గురుకుల, ఆశ్రమ పాఠశాలలను జీరో వేస్ట్ స్కూల్స్ గా మారుస్తూ కలెక్టర్ విజయ కృష్ణన్ చేసిన వినూత్న కార్యక్రమం సీఎం చంద్రబాబు ప్రశంసలు అందుకుంది. అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో జీరో వేస్ట్ స్కూల్స్‌లో చెత్త నుంచి సంపద సృష్టిపై కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. ఈ విధానాన్ని రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అమలు చేయాలని సీఎం ఆదేశించారు.
Similar News
News April 15, 2026
ఏప్రిల్ 15: చరిత్రలో ఈ రోజు

*1452: బహుముఖ ప్రజ్ఞాశాలి లియొనార్డో డావిన్సి జయంతి(ఫొటోలో)
*1469: భారత ఆధ్యాత్మిక గురువు గురునానక్ జయంతి
*1865: అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ మరణం
*1912: టైటానిక్ షిప్ మునిగిపోయిన రోజు
*1977: భారత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ జననం
*ప్రపంచ కళా దినోత్సవం
*సాంస్కృతిక సార్వత్రిక దినోత్సవం
News April 15, 2026
విశాఖను సౌర హబ్‌గా తీర్చిదిద్దుతాం: MP భరత్

విశాఖ జిల్లాను సౌర విద్యుత్ హబ్‌గా తీర్చిదిద్దుతామని MP భరత్ పేర్కొన్నారు. MVPలోని హెలెన్ కెల్లర్ పాఠశాలలో 5KV సోలార్ ప్రాజెక్టును కలెక్టర్ M.అభిషిక్త్ కిశోర్ తో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యమని ఆయన చెప్పారు. కేంద్రం ప్రవేశపెట్టిన ‘పీఎం సూర్యఘర్’ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
News April 15, 2026
పవన్‌తో తోట చంద్రశేఖర్ భేటీ.. మళ్లీ జనసేనలోకి?

AP: జనసేన అధినేత, DyCM పవన్ కళ్యాణ్‌ను తోట చంద్రశేఖర్ కలిశారు. మంగళగరిలోని జనసేన ఆఫీసులో భేటీ అయ్యారు. చంద్రశేఖర్ 2019లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. మూడేళ్ల కిందట BRS పార్టీలో చేరారు. AP BRS అధ్యక్షుడిగా పని చేశారు. కానీ చాలా రోజులుగా ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. పవన్‌ను కలవడంతో ఆయన మళ్లీ జనసేనలోకి చేరుతారనే చర్చ జరుగుతోంది.


