News April 13, 2026
అమరావతి ORRకు 19 ఇంటర్ చేంజ్‌లు

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) ప్లానింగ్ పూర్తయింది. 190 కిలోమీటర్ల మేర నిర్మించే ఈ మార్గంలో యాక్సెస్ కంట్రోల్ కఠినంగా ఉంటుంది. వాహనాలు ఈ రోడ్డుపైకి రావడానికి, బయటకు వెళ్లడానికి కేవలం 19 చోట్ల మాత్రమే ఇంటర్ చేంజ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. నందివెలుగు, తెనాలి స్పర్ రోడ్, నారాకోడూరు, పుల్లడిగుంట, లింగాయపాలెం, మేడికొండూరు, కాజ తదితర 19 ప్రాంతాల్లో మాత్రమే ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఉండనున్నాయి.
Similar News
News April 20, 2026
GNT: ఇస్రో ‘యువికా’కు జిల్లా విద్యార్థినుల ఎంపిక.. కలెక్టర్ ప్రశంసలు

జాతీయ స్థాయిలో ఇస్రో నిర్వహించిన ‘యువికా’ యంగ్ సైంటిస్ట్ అవార్డులకు ఎంపికైన జిల్లా విద్యార్థినులను కలెక్టర్ సాయి కాంత్ వర్మ అభినందించారు. ఫిరంగిపురం (M) వేములూరిపాడుకు చెందిన జ్యోతిర్మయి, వట్టిచెరుకూరు (M) ముట్లూరుకు చెందిన సుస్మితా చంద్ ఈ గౌరవం దక్కించుకున్నారు. సోమవారం DEO సలీం భాషాతో కలిసి కలెక్టరేట్‌లో వారు కలెక్టర్‌ను కలిశారు. విద్యార్థినుల ప్రతిభను కలెక్టర్ ప్రత్యేకంగా కొనియాడారు.
News April 20, 2026
పట్టాలెక్కని ముఖ్య అమరావతి ప్రాజెక్టులు

అమరావతిలో కీలక నిర్మాణాలెవీ ఇంకా ప్రారంభం కాలేదు. ORR, IRR, విజయవాడ మెట్రో, విమానాశ్రయం, రైల్వే లైన్ వంటి ప్రాజెక్టులు ముందుకు సాగలేదని విశ్లేషకులు అంటున్నారు. ఇవన్నీ టెండర్లు, భూసేకరణ దశల్లోనే ఉన్నాయి. రాజధాని అభివృద్ధికి ఈ ప్రాజెక్టులే అత్యంత కీలకం. ఇవి పట్టాలెక్కితేనే నగర రవాణా మెరుగుపడుతుందన్నారు. ప్రణాళికలు ఉన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో అమలు ఇంకా మొదలు కాలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.