News April 18, 2026
అరసవెల్లి నకిలీ పాసులు ముద్రించిన నిందితుల అరెస్ట్

అరసవెల్లి రథసప్తమి వేడుకల్లో నకిలీ పాసులు వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ఆరుగురు నిందితులను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. టూ టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక ఉన్న మణికంఠ జిరాక్స్‌లో నకిలీ పాసులు ముద్రించినట్లు నిర్ధారించారు. నిందితుల్లో మణికంఠ జిరాక్స్ షాప్ యజమానులు కొండలరావు, మణికంఠ, సంతోష్‌తో పాటు హరి ప్రసాద్, శీను, రాజు ఉన్నట్లు వన్ టౌన్ ఎస్ఐ హరికృష్ణ తెలిపారు.
Similar News
News April 20, 2026
శ్రీకాకుళం: పద్మ పురస్కారాలకి నామినేషన్ల ఆహ్వానం

పద్మ పురస్కారాలకి నామినేషన్ల ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 31 వరకు ఆన్‌లైన్‌లో వివరాలు https://awards.gov.inలో నమోదు చేసుకోవాలన్నారు.
జిల్లాలోని వివిధ రంగాలకు చెందిన ప్రతిభావంతులు, నిస్వార్థ సేవకుల నుంచి 2027 సంవత్సరపు ‘పద్మ’ పురస్కారాలకు ప్రతిపాదనలు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు.

శ్రీకాకుళం: ఇంటర్మీడియట్ ఫెయిలైన వారికి గమనిక

ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ ఏడాది ఫీజుల స్వీకరణ సోమవారం నుంచి ప్రారంభమైనట్లు శ్రీకాకుళం ఆర్ఐఓ ఆర్. సురేశ్ కుమార్ తెలిపారు. ఈ నెల 27 లోపు ఫీజులు చెల్లించాలన్నారు. ఫెయిలైన వారు, మొదటి ఏడాది, రెండో ఏడాది ఇంప్రూవ్మెంట్ పరీక్ష రాసేవారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ద్వితీయ సంవత్సరం ఇంప్రూవ్మెంట్ రాసేందుకు ఈ ఏడాది కొత్తగా అవకాశం కల్పించినట్లు చెప్పారు.