News August 13, 2024
ఆదిలాబాద్: ఆటో డ్రైవర్.. ‘మిస్టర్ మహరాష్ట్ర’లో విన్నర్

ఆ యువకుడు ఎప్పటికైనా వెండితెరపై మెరవాలని కలలు కన్నాడు. ADBకి చెందిన ఆటో డ్రైవర్ సూర్యవంశీ ప్రశాంత్ ప్రతినాయకుడు అనూప్ సింగ్ ఠాకూర్‌ను స్ఫూర్తిగా తీసుకున్నాడు. 6 ప్యాక్ కోసం జిమ్‌లో శ్రమించాడు. పొడవాటి జట్టు పెంచుకున్నాడు. తాజాగా మిస్టర్ మహారాష్ట్ర పోటీల్లో పాల్గొని ఉత్తమ హెయిర్ స్టైల్ పురస్కారాన్ని అందుకున్నాడు. ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా ప్రతిభ ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు.
Similar News
News February 14, 2026
ఆదిలాబాద్: DSP, BSPకి పోలైన ఓట్లు ఇలా..!

మున్సిపల్ ఎన్నికల బరిలో ధర్మ సమాజ్ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలు సైతం పోటీ చేశాయి. కాగా ఎవరు కూడా ఒక వార్డును కూడా గెలుచుకోలేదు. BSP పోటీ చేసిన వార్డులలో ఏడో వార్డు అభ్యర్థికి 13 ఓట్లు, 30వ వార్డు అభ్యర్థికి 93 ఓట్లు, 39 వార్డు అభ్యర్థికి 67 ఓట్లు మొత్తం BSPకి 173 ఓట్లు పొలయ్యాయి. ఇక DSP రెండు వార్డులలో పోటీ చేసింది. 6వ వార్డు అభ్యర్థికి 17 ఓట్లు 39 వార్డు అభ్యర్థికి అత్యధికంగా 368 ఓట్లు వచ్చాయి.
News February 14, 2026
నిందితులకు శిక్ష పడేలా పనిచేయాలి: ADB SP

ప్రతి కేసులో నిందితులకు శిక్ష పడేలా పోలీసు అధికారులు పూర్తి పర్యవేక్షణతో వ్యవహరించాలని SP అఖిల్ మహాజన్ ఆదేశించారు. శనివారం పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో కోర్టు డ్యూటీ అధికారులు, డీఎస్పీలు, సీఐలతో ఆయన సమీక్ష నిర్వహించారు. నిందితులు కోర్టుకు హాజరయ్యేలా చూడాలని, రౌడీషీటర్లపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు రివార్డులు అందజేస్తామని ప్రకటించారు.
News February 14, 2026
సైబర్ మోసాలపై అప్రమత్తతే రక్షణ: ADB SP

సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదిలాబాద్ జిల్లా SP అఖిల్ మహాజన్ సూచించారు. APK లింకులు, AI వీడియో కాల్స్, పెట్టుబడి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈ వారం జిల్లాలో 16 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. బాధితులు మోసపోయిన వెంటనే గోల్డెన్ అవర్‌లో 1930కు ఫిర్యాదు చేస్తే నగదు తిరిగి పొందే అవకాశం ఉంటుందని, వ్యక్తిగత వివరాలు ఎవరికీ తెలపవద్దని ఆయన స్పష్టం చేశారు.


