News February 14, 2026
నిందితులకు శిక్ష పడేలా పనిచేయాలి: ADB SP

ప్రతి కేసులో నిందితులకు శిక్ష పడేలా పోలీసు అధికారులు పూర్తి పర్యవేక్షణతో వ్యవహరించాలని SP అఖిల్ మహాజన్ ఆదేశించారు. శనివారం పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో కోర్టు డ్యూటీ అధికారులు, డీఎస్పీలు, సీఐలతో ఆయన సమీక్ష నిర్వహించారు. నిందితులు కోర్టుకు హాజరయ్యేలా చూడాలని, రౌడీషీటర్లపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు రివార్డులు అందజేస్తామని ప్రకటించారు.
Similar News
News April 20, 2026
ADB: ఓపెన్ ఇంటర్, టెన్త్ పరీక్షలు.. 177 మంది గైర్హాజరు

TOSS ఓపెన్ ఇంటర్ టెన్త్ పరీక్షలు సోమవారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. జిల్లాలో పదో తరగతికి 4 ఇంటర్‌కు 3 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పది పరీక్షకు 548 విద్యార్థులకు గాను 410 మంది హాజరై 130 మందికి గైర్హాజరయ్యారు. అలాగే ఇంటర్‌కు 461 మంది విద్యార్థులకు గాను 414 మంది విద్యార్థులు హాజరై 47 మంది గైర్హాజరయ్యారని అధికారులు తెలిపారు.
News April 20, 2026
ADB: నేటి నుంచి వారోత్సవాలు.. కలెక్టర్ ALERT

ఆదిలాబాద్ జిల్లాలో సంక్షేమ వారోత్సవాలను ఈనెల 20 నుంచి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఏప్రిల్ 20 నుంచి 26 వరకు వారం రోజుల పాటు ఈ సంక్షేమ వారోత్సవాలు జరుగుతాయన్నారు. ప్రతి రోజూ ప్రత్యేక కార్యక్రమాలను ప్రణాళికబద్దంగా నిర్వహిస్తూ, నివేదికలను నమోదు చేయాలన్నారు.
News April 19, 2026
ADB: 4 క్వింటాళ్ల కోళ్ల చోరీ.. ముగ్గురి అరెస్టు

ఆదిలాబాద్‌లోని దస్నాపూర్‌లో కోళ్ల దొంగతనం కేసును మావల పోలీసులు చేధించారు. పోలీసులు తెలిపిన వివరాలు.. రాత్రి సమయంలో కొందరు దుండగులు షాప్ వెనుక భాగంలో టిన్ షీట్లు కట్ చేసి లోపలికి ప్రవేశించి సుమారు 4 క్వింటాళ్ల కోళ్లను ఎత్తుకెళ్లారు. సుగుణ చికెన్ సెంటర్ యజమాని సంజీవ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులు అమన్, ఫిరోజ్ ఖాన్, ముజాహిద్ అలీని అరెస్టు చేశారు. ఒకరు పరారీలో ఉన్నారు.


