News August 1, 2024
ఆదిలాబాద్: యూత్ కాంగ్రెస్లో ఎన్నికల సందడి

ఆదిలాబాద్ జిల్లా యూత్ కాంగ్రెస్లో ఎన్నికల సందడి నెలకొంది. బరిలో నిలిచిన అభ్యర్థులు గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఆన్లైన్ ఓటింగ్ కావడంతో కార్యకర్తల మద్దతు కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. జిల్లా స్థాయిలో గెలుపొందిన వారు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించనున్నారు. ఈనేపథ్యంలో ఎన్నికలు ఆసక్తికరంగా మారగా.. హస్తం పార్టీకి క్షేత్రస్థాయిలో వెన్నుదన్నుగా యువ జన కాంగ్రెస్ నిలుస్తోంది.
Similar News
News February 14, 2026
ఆదిలాబాద్: DSP, BSPకి పోలైన ఓట్లు ఇలా..!

మున్సిపల్ ఎన్నికల బరిలో ధర్మ సమాజ్ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలు సైతం పోటీ చేశాయి. కాగా ఎవరు కూడా ఒక వార్డును కూడా గెలుచుకోలేదు. BSP పోటీ చేసిన వార్డులలో ఏడో వార్డు అభ్యర్థికి 13 ఓట్లు, 30వ వార్డు అభ్యర్థికి 93 ఓట్లు, 39 వార్డు అభ్యర్థికి 67 ఓట్లు మొత్తం BSPకి 173 ఓట్లు పొలయ్యాయి. ఇక DSP రెండు వార్డులలో పోటీ చేసింది. 6వ వార్డు అభ్యర్థికి 17 ఓట్లు 39 వార్డు అభ్యర్థికి అత్యధికంగా 368 ఓట్లు వచ్చాయి.
News February 14, 2026
నిందితులకు శిక్ష పడేలా పనిచేయాలి: ADB SP

ప్రతి కేసులో నిందితులకు శిక్ష పడేలా పోలీసు అధికారులు పూర్తి పర్యవేక్షణతో వ్యవహరించాలని SP అఖిల్ మహాజన్ ఆదేశించారు. శనివారం పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో కోర్టు డ్యూటీ అధికారులు, డీఎస్పీలు, సీఐలతో ఆయన సమీక్ష నిర్వహించారు. నిందితులు కోర్టుకు హాజరయ్యేలా చూడాలని, రౌడీషీటర్లపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు రివార్డులు అందజేస్తామని ప్రకటించారు.
News February 14, 2026
సైబర్ మోసాలపై అప్రమత్తతే రక్షణ: ADB SP

సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదిలాబాద్ జిల్లా SP అఖిల్ మహాజన్ సూచించారు. APK లింకులు, AI వీడియో కాల్స్, పెట్టుబడి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈ వారం జిల్లాలో 16 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. బాధితులు మోసపోయిన వెంటనే గోల్డెన్ అవర్‌లో 1930కు ఫిర్యాదు చేస్తే నగదు తిరిగి పొందే అవకాశం ఉంటుందని, వ్యక్తిగత వివరాలు ఎవరికీ తెలపవద్దని ఆయన స్పష్టం చేశారు.


