News April 12, 2024
ఇంటర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా టాప్

ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో 90 శాతంతో కృష్ణా జిల్లా రాష్ట్రంలోనే తొలి స్థానంలో నిలిచింది. 17,425 మందికి 1,5688 మంది పాసయ్యారు. ఎన్టీఆర్ జిల్లా 87 శాతంతో 3వ స్థానంలో నిలిచింది. 34,156 మందికి 29,707 మంది పాసయ్యారు. ఫస్ట్ ఇయర్‌లోనూ 84 శాతంతో కృష్ణా తొలిస్థానంలో నిలిచింది. 20,324 మందికి 17,070 మంది పాసయ్యారు. ఎన్టీఆర్ జిల్లా 79 శాతంతో 3వ స్థానంలో నిలిచింది. 38,307 మందికి 30353 మంది పాసయ్యారు.
Similar News
News February 19, 2026
మంగినపూడి బీచ్‌లో 24న సందడే సందడి..!

ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా స్థాయి సాప్ లీగ్ టోర్నమెంట్‌లో భాగంగా సైక్లింగ్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీలు ఈనెల 24న మచిలీపట్నం మంగినపూడి బీచ్ వద్ద నిర్వహించనున్నారు. అండర్-18 బాలురకు 10 కి.మీ., బాలికలకు 5 కి.మీ. దూరంతో పోటీలు నిర్వహిస్తారు. పాల్గొనదలచిన క్రీడాకారులు www.sports.ap.gov.inలో ముందుగా నమోదు చేసుకోవాలని జిల్లా క్రీడా అధికారి తెలిపారు.
News February 19, 2026
కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

* పెనమలూరులో ఈనెల 21న జాబ్ మేళా
* మచిలీపట్నంలో రైల్వే జాబ్ స్కామ్
* కృష్ణా: పదో తరగతి పరీక్షలపై కలెక్టర్ సమీక్ష
* విజయవాడలో డివైడర్‌ను ఢీకొట్టిన ట్రావెల్ బస్సు
* బందర్‌లో బెల్ట్ దందా
* గుడివాడ సీసీఎస్ పోలీస్ స్టేషన్లో అగ్ని ప్రమాదం
* గూడూరులో కొడుకు పై పేకాట కేసు.. తండ్రి ఆత్మహత్యాయత్నం
News February 18, 2026
కృష్ణా: పదో తరగతి పరీక్షలపై కలెక్టర్ సమీక్ష

కృష్ణా జిల్లాలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు నిర్వహించనున్న పదో తరగతి, ఓపెన్ స్కూల్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై కలెక్టర్ డీకే బాలాజీ బుధవారం అధికారులతో సమీక్షించారు. విద్య, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కేంద్రాల వద్ద వసతులు కల్పించాలని సూచించారు.


