News January 2, 2026

ఈ నెల 3న మల్లన్న వార్షిక ఆరుద్రోత్సవం

image

ఈ నెల 3న లోక కల్యాణార్థమై శ్రీశైలంలో శ్రీ స్వామివారికి వార్షిక ఆరుద్రోత్సవం నిర్వహించనున్నారు. ఆరుద్రోత్సవాన్ని ప్రతి నెలలో మాసోత్సవంగా నిర్వహిస్తుండగా, ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున మాత్రం వార్షిక ఆరుద్రోత్సవం నిర్వహిస్తారు. 2న రాత్రి 10 గంటల నుండి శ్రీస్వామివారికి మహాన్యాస పారాయణ, లింగోద్భవకాల ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, 3న నందివాహన సేవ, గ్రామోత్సవం జరిపిస్తారు.

Similar News

News January 2, 2026

VKB: ‘సరిపడా యూరియా అందుబాటులో ఉంది’

image

వికారాబాద్ జిల్లాలో రైతులకు 3,545 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉన్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి రాజారత్నం తెలిపారు. అన్ని మండల కేంద్రాల్లో యూరియా అందుబాటులో ఉంచామని తెలిపారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు. యూరియాను తీసుకొని పంటలు సాగు చేసుకోవాలన్నారు.

News January 2, 2026

పాసుపుస్తకాల పంపిణీతో ఇళ్లల్లో సంతోషం: CBN

image

AP: 22 లక్షల పాసుపుస్తకాల పంపిణీతో ప్రతి ఇంట్లో సంతోషం నెలకొందని CM CBN పేర్కొన్నారు. ‘గత పాలకులు తమ ఫొటోలతో పాసుపుస్తకాలు పంపిణీ చేసి ₹22Cr తగలేశారు. రీసర్వేతో వివాదాలు పెంచారు. మేం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతో మేలు చేశాం. లక్ష్యం నెరవేరేలా మంత్రులు చొరవ చూపాలి’ అని టెలికాన్ఫరెన్సులో CM సూచించారు. ఇవాళ ఆరంభమైన పాసుపుస్తకాల పంపిణీ 9వ తేదీ వరకు కొనసాగనుంది. కార్యక్రమంలో ఒకరోజు CM పాల్గొంటారు.

News January 2, 2026

‘పొలం బాట’తో రైతుల విద్యుత్ కష్టాలకు చెక్: ఎస్‌ఈ

image

అన్నదాతల విద్యుత్ సమస్యల తక్షణ పరిష్కారమే లక్ష్యంగా చేపట్టిన ‘పొలం బాట’ కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోందని విద్యుత్ శాఖ ఎస్‌ఈ శ్రీనివాస చారి తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 557 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి, వేలాడుతున్న వైర్లు మరియు వంగిన స్తంభాలను సరిచేసినట్లు పేర్కొన్నారు. విద్యుత్ ప్రమాదాల నివారణకు ఎత్తైన స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ గద్దెలను ఏర్పాటు చేశామన్నారు.