News April 7, 2026

ఉత్తమ వైద్యులుగా అవార్డులు అందుకున్న ఖమ్మం జిల్లా డాక్టర్లు

image

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా HYDలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తమ వైద్యులను రాష్ట్ర ప్రభుత్వం సత్కరించింది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో విశిష్ట సేవలకు గాను DCHS డా.రాజశేఖర్, పెనుబల్లి CHC డా. కిరణ్ కుమార్, డా. శివరామకృష్ణ, కల్లూరు CHC డా. రామ్‌శరణ్ పురస్కారాలు అందుకున్నారు. మంత్రి దామోదర్ రాజనర్సింహ వీరికి అవార్డులు అందజేశారు.

Similar News

News April 20, 2026

KMM: మొక్కజొన్న కొనుగోళ్లపై కలెక్టర్లకు మంత్రి తుమ్మల ఆదేశాలు

image

మొక్కజొన్న కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చోట అదనపు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మార్క్‌ఫెడ్ ద్వారా 200 కేంద్రాల్లో కొనుగోళ్లు కొనసాగుతున్నాయని తెలిపారు. కొనుగోలు చేసిన మొక్కజొన్నను వెంటనే గోదాములకు తరలించేలా చర్యలు తీసుకోవాలని మార్క్‌ఫెడ్ అధికారులను సూచించారు.

అందుబాటులోకి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే

image

జిల్లా ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే (ప్యాకేజీ-2) సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. వైరా మండలంలోని సోమవరం ఎగ్జిట్ పాయింట్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని దేవరపల్లి వరకు నిర్మించిన ఈ రహదారిని అధికారులు ప్రారంభించారు. నేటి నుంచి టోల్ వసూళ్లు మొదలయ్యాయి. కాగా, ఈ రహదారిపై ద్విచక్ర వాహనాలు, ఆటోలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.