News March 28, 2025
ఎటపాక : రోడ్డుపై శవాన్ని వదిలి పరుగులు

తేనెటీగలు దాడి చేయడంతో శవాన్ని రోడ్డు మీదే వదిలేసి పరారైన ఘటన ఎటపాకలోని గౌరీదేవి పేట గ్రామంలో శుక్రవారం జరిగింది. గౌరీదేవిపేట గ్రామంలో చనిపోయిన మృతదేహాన్ని అంత్యక్రియలకు తీసుకొస్తుండగా.. దారి మధ్యలో తేనెటీగల గుంపు దాడి చేసింది. దీంతో నడిరోడ్డు మీద శవాన్ని వదిలేసి ప్రజలంతా తలోదిక్కుకి పరుగులు పెట్టారు.
Similar News
News March 31, 2025
ముస్లిం సోదరులకు గవర్నర్, సీఎం రంజాన్ శుభాకాంక్షలు

AP: రాష్ట్రంలోని ముస్లింలకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, CM చంద్రబాబు, మాజీ CM జగన్ పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు అల్లా దయతో విజయవంతం కావాలని CM కోరారు. జకాత్ పేరుతో సాటివారిని ఆదుకునే దయా గుణం ముస్లిం వర్గంలోని మానవత్వానికి ప్రతిరూపం అన్నారు. అల్లా చూపిన మార్గంలో నడవాలని, అందరిపై ఆయన దీవెనలు ఉండాలని కోరుకుంటున్నట్లు జగన్ పేర్కొన్నారు.
News March 31, 2025
గాయం నుంచి ఇంకా కోలుకోలేదు: హీరోయిన్

జిమ్ చేస్తూ గాయపడిన తాను ఇంకా పూర్తిగా కోలుకోలేదని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అన్నారు. గత ఏడాది చివర్లో ఆమె వెయిట్ లిఫ్ట్ చేసే క్రమంలో గాయపడ్డారు. తాను చాలా విషయాల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే ప్రతికూల పరిస్థితుల్లోనూ కమిట్ అయిన సినిమాలను తాను పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు సినిమాలకు దూరమయ్యారు.
News March 31, 2025
నేడు YV సుబ్బారెడ్డి తల్లి పెద్దకర్మ.!

తన తల్లి పిచ్చమ్మకు సోమవారం పెద్దకర్మ నిర్వహిస్తున్నట్లు ఒంగోలు మాజీ ఎంపీ వై.వీ సుబ్బారెడ్డి తెలియజేశారు. భద్రతా కారణాల దృష్ట్యా స్వగ్రామం మేదరమెట్లలో కాకుండా.. ఒంగోలులో సౌత్ బైపాస్ రోడ్డు దగ్గర ఉన్న ఫంక్షన్ హాల్‌లో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా ఈ కార్యక్రమానికి పిచ్చమ్మ అల్లుడు.. మాజీ మంత్రి బాలినేని. శ్రీనివాసరెడ్డి హాజరవుతారా, లేదా అనేది తెలియాల్సి ఉంది.