News March 31, 2025
ముస్లిం సోదరులకు గవర్నర్, సీఎం రంజాన్ శుభాకాంక్షలు

AP: రాష్ట్రంలోని ముస్లింలకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, CM చంద్రబాబు, మాజీ CM జగన్ పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు అల్లా దయతో విజయవంతం కావాలని CM కోరారు. జకాత్ పేరుతో సాటివారిని ఆదుకునే దయా గుణం ముస్లిం వర్గంలోని మానవత్వానికి ప్రతిరూపం అన్నారు. అల్లా చూపిన మార్గంలో నడవాలని, అందరిపై ఆయన దీవెనలు ఉండాలని కోరుకుంటున్నట్లు జగన్ పేర్కొన్నారు.
Similar News
News April 22, 2025
గిల్-సాయి జోడీ అదుర్స్

గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ అదరగొడుతున్నారు. తొలి వికెట్‌కు మంచి భాగస్వామ్యం నమోదు చేస్తూ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటి వరకు 8 ఇన్నింగ్సుల్లో 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలతో సహా మొత్తం 448 పరుగుల పార్ట్‌నర్‌షిప్ అందించారు. ఈ ఏడాది ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఇవే అత్యధికం. ఆ తర్వాతి స్థానాల్లో RCB నుంచి కోహ్లీ-సాల్ట్(315), SRH నుంచి హెడ్-అభిషేక్(314) ఉన్నారు.
News April 22, 2025
నేడు కేంద్ర మంత్రులతో సీఎం భేటీ

AP: యూరప్ పర్యటన ముగించుకుని సీఎం చంద్రబాబు అర్ధరాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. అందుబాటులో ఉన్న టీడీపీ ఎంపీలతో సమావేశమయ్యారు. ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ సమస్యలు, విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానంపై చర్చిస్తారు. ఇది బీజేపీకే దక్కనుందని సమాచారం. అలాగే కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, సీఆర్ పాటిల్‌తోనూ ఆయన సమావేశమవుతారు.
News April 22, 2025
నటన నా రక్తంలోనే ఉంది.. త్వరలోనే రీఎంట్రీ: రంభ

తన పిల్లల కోసమే సినిమాలకు దూరమయ్యానని అలనాటి హీరోయిన్ రంభ వెల్లడించారు. ఇప్పుడు కుమార్తెలకు 14, 10 ఏళ్లు, కుమారుడికి 6 ఏళ్లు వచ్చాయన్నారు. ప్రస్తుతం భర్త ప్రోత్సాహంతో ఓ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. ఇండస్ట్రీకి 15 ఏళ్లు దూరమైనా నటన తన రక్తంలోనే ఉందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. త్వరలోనే వెండితెరపై కనిపించాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు.