News April 16, 2026

ఎన్టీఆర్: ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలదే పైచేయి

image

ఎన్టీఆర్ జిల్లా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల 2026 ఫలితాల్లో అమ్మాయిలు మరోసారి ఆధిక్యం చాటుకున్నారు. మొదటి సంవత్సరం ఇంటర్‌లో అమ్మాయిల ఉత్తీర్ణత శాతం 85%గా నమోదవగా, అబ్బాయిలు 80% మాత్రమే సాధించారు. రెండో సంవత్సరం ఇంటర్‌లో కూడా అమ్మాయిలు 87% ఉత్తీర్ణతతో ముందంజలో నిలిచారు, అబ్బాయిల ఉత్తీర్ణత 84%గా ఉంది. మొత్తం చూసుకుంటే అమ్మాయిలు 86% ఉత్తీర్ణత సాధించగా, అబ్బాయిలు 82% మాత్రమే సాధించడం గమనార్హం.

Similar News

News April 16, 2026

పార్లమెంట్‌లో కేంద్రం ప్రవేశపెట్టే 3 బిల్లులు ఇవే..

image

1. కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు-2026: ఢిల్లీ, J&K, పుదుచ్చేరిలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన. ఇందులోనే మహిళా రిజర్వేషన్ల అమలు.
2. రాజ్యాంగ(131వ) సవరణ బిల్లు: LS, అసెంబ్లీ స్థానాల్లో 33% మహిళా రిజర్వేషన్లు తక్షణమే అమలు. MP స్థానాలను 850కి పెంచడం.
3. డీలిమిటేషన్ బిల్లు-2026: కొత్తగా పెరిగే సీట్ల కేటాయింపు, నియోజకవర్గాల సరిహద్దులను నిర్ణయించేందుకు కమిషన్ ఏర్పాటు.

News April 16, 2026

BREAKING: లోక్‌సభలో డీలిమిటేషన్ బిల్లు.. వాడీవేడీ చర్చ

image

లోక్‌సభలో మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ డీలిమిటేషన్ బిల్లును సభ ముందుకు తీసుకొచ్చారు. దీనిని చర్చకు అనుమతించడంపై కేంద్ర మంత్రులు, ప్రతి‌పక్ష ఎంపీల మధ్య వాడీవేడీగా చర్చ జరుగుతోంది. మొత్తం మూడు బిల్లులపై లోక్‌సభలో 18 గంటలు, రాజ్యసభలో 10 గంటలపాటు చర్చ, ఆపై ఓటింగ్ జరగనుంది.

News April 16, 2026

మైదుకూరు: ఇంటర్‌లో ఫెయిల్.. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి

image

మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన జి. హరి ఈశ్వర్(18) సమీపంలోని చెరువులో పడి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. మృతుడు ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం విడుదలైన ఫలితాలలో ఫెయిల్ అవ్వడంతో ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అలాగే ఈశ్వర్ తండ్రి మునెయ్య ఆరోగ్య పరిస్థితి సరిగా లేదు.