News March 18, 2025
ఎయిర్‌పోర్టుకు దొడ్డి కొమురయ్య పేరు పెట్టాలని డిమాండ్

జనగామలో కురుమ సంఘం నేతలు మంగళవారం సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మండల యూత్ అధ్యక్షుడు బండ ప్రభాకర్ కురుమ హాజరై మాట్లాడారు. నూతనంగా నిర్మించబోయే మామూనూరు ఎయిర్‌పోర్టుకు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, తొలి అమరుడు దొడ్డి కొమురయ్య పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే ఏప్రిల్ 3న హైదరాబాద్‌లో జరగబోయే దొడ్డి కొమురయ్య 98వ జయంతి వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కురుమ సంఘం ముఖ్య నేతలున్నారు.
Similar News
News March 18, 2025
కసాయి వాళ్లను నమ్మకండి.. బీసీ నేతలతో సీఎం

TG: బీసీలకు 42% రిజర్వేషన్లపై బిల్లును ప్రవేశపెట్టినందుకు బీసీ సంఘాల నాయకులు సీఎం రేవంత్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ‘బీసీ కులగణన చేయాలనేది రాహుల్ గాంధీ ఆలోచన. మీరు కృతజ్ఞతలు చెప్పాల్సింది ఆయనకే. 10 లక్షల మందితో రాహుల్‌కు కృతజ్ఞత సభ పెట్టండి. సర్వేలో పాల్గొనని వారిని వెళ్లి కలుస్తున్నారు. ఆ కసాయి వాళ్లను నమ్మకండి’ అని సూచించారు.
News March 18, 2025
ఎస్సీ వర్గీకరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

TG: ఎస్సీ వర్గీకరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. 59 ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా వర్గీకరిస్తూ ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టింది. 15 శాతం రిజర్వేషన్లను గ్రూపుల వారిగా పంచినట్లు సీఎం రేవంత్ తెలిపారు. గ్రూప్-1లోని అత్యంత వెనుకబడిన 15 కులాలకు 1%, మాదిగలున్న గ్రూప్-2లోని 18 కులాలకు 9%, మాలలు ఉన్న గ్రూప్-3లోని 26 కులాలకు 5% రిజర్వేషన్లు కేటాయించారు.
News March 18, 2025
ఏప్రిల్ 15 తర్వాత ‘అమరావతి’ పనులు

AP: వచ్చే నెల 15 తర్వాత రాజధాని అమరావతి పనులు పున:ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తాత్కాలిక సచివాలయం వెనుక ఉన్న ప్రాంతంలో తొలుత పనులు మొదలుపెట్టనుంది. అక్కడే ప్రధాని మోదీతో సభను నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని సీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. కాగా ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు ప్రధానిని ఆహ్వానించనున్నారు.