News March 18, 2025

కసాయి వాళ్లను నమ్మకండి.. బీసీ నేతలతో సీఎం

image

TG: బీసీలకు 42% రిజర్వేషన్లపై బిల్లును ప్రవేశపెట్టినందుకు బీసీ సంఘాల నాయకులు సీఎం రేవంత్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ‘బీసీ కులగణన చేయాలనేది రాహుల్ గాంధీ ఆలోచన. మీరు కృతజ్ఞతలు చెప్పాల్సింది ఆయనకే. 10 లక్షల మందితో రాహుల్‌కు కృతజ్ఞత సభ పెట్టండి. సర్వేలో పాల్గొనని వారిని వెళ్లి కలుస్తున్నారు. ఆ కసాయి వాళ్లను నమ్మకండి’ అని సూచించారు.

Similar News

News April 19, 2025

కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ ఫైర్

image

AP: విశాఖ <<16147304>>మేయర్ పీఠం కూటమి<<>> ప్రభుత్వం దక్కించుకోవడంపై వైసీపీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వ దుర్మార్గపు రాజకీయాలకు ఇది నిదర్శనమని మండిపడ్డారు. YCP 58 స్థానాలు గెలిస్తే, కూటమి 30 సీట్లే గెలిచిందని, ఏ రకంగా మేయర్ పదవి వస్తుందని ప్రశ్నించారు. ఇలాంటి అప్రజాస్వామిక విధానాలకు దేవుడు, ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు.

News April 19, 2025

రాజ్ ఠాక్రేతో పొత్తుకు సిద్ధమే: ఉద్ధవ్ ఠాక్రే

image

మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే సంచలన ప్రకటన చేశారు. తన సోదరుడు, రాజ్ ఠాక్రేతో పొత్తుకు సిద్ధమన్నారు. మహారాష్ట్ర ప్రయోజనాల కోసం చిన్నచిన్న సంఘటనలను పక్కకు పెట్టి తన సోదరుడితో కలిసి నడుస్తామన్నారు. కాగా MNS చీఫ్ రాజ్ ఠాక్రే సైతం రెండు పార్టీలు కలవడం పెద్ద కష్టమేమీ కాదని వ్యాఖ్యానించారు. శివసేన పార్టీలో విభేదాలతో రాజ్ ఠాక్రే పార్టీనుంచి బయటకు వచ్చి MNSను స్థాపించారు.

News April 19, 2025

సిక్సర్ల రికార్డు సృష్టించిన కేఎల్ రాహుల్

image

ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ KL రాహుల్ రికార్డు సృష్టించారు. IPLలో భారత్ తరఫున తక్కువ ఇన్నింగ్సులలో 200 సిక్సులు కొట్టిన ప్లేయర్‌గా నిలిచారు. ఓవరాల్‌గా మూడోస్థానంలో ఉన్నారు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచులో సిక్సర్ బాది రాహుల్ ఈ ఫీట్ సాధించారు. రాహుల్ 129 ఇన్నింగ్సుల్లో 200 సిక్సర్లు కొట్టారు. ఈ జాబితాలో క్రిస్ గేల్ 69Inns, ఆండ్రీ రస్సెల్ 97Inns తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

error: Content is protected !!