News March 4, 2025
ఏలూరు: ఎమ్మెల్సీగా గెలిచిన కూటమి అభ్యర్ధి పేరాబత్తుల

ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం భారీ విజయం సాధించారు. ఎన్నికల అధికారి, ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి చేతుల మీదుగా ఆయన గెలుపు పత్రం అందుకున్నారు. రాజశేఖరం వెంట ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు ఉన్నారు. రాజశేఖరం గెలుపుతో కూటమి నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు.
Similar News
News March 4, 2025
సూర్యాపేట: టీచర్ అవతారమెత్తిన కలెక్టర్..

సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధ్యాపకుడి అవతారం ఎత్తారు. మంగళవారం చివ్వెంల మండల పరిధిలోని ఐలాపురం తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులకు పాఠాలు బోధించారు. పలు సబ్జెక్టుల్లో విద్యార్థులను ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు ఉన్నారు.
News March 4, 2025
MLC కౌంటింగ్: 4,320 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి

TG: ఆదిలాబాద్-నిజామాబాద్-కరీంనగర్-మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మూడో రౌండ్ ముగిసేసరికి 4,320 లీడ్ సాధించారు. ఇప్పటివరకు అంజిరెడ్డికి 23,246, నరేందర్ రెడ్డికి (కాంగ్రెస్) 18,296, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 15,740 ఓట్లు వచ్చాయి. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
News March 4, 2025
కాకినాడ: MLCగా గెలిచిన రాజశేఖరం నేపథ్యం ఇదే..!

ఉభయగోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలుపొందిన పేరాబత్తుల రాజశేఖరం స్వగ్రామం కోనసీమ జిల్లాలోని జి.వేమవరం. తొలుత ఆయన కాంగ్రెస్ ఎంపీటీసీగా, అనంతరం టీడీపీ నుంచి ఎంపీపీ, జడ్పీటీసీగా పనిచేశారు. ఆక్వా వ్యాపారం చేసే రాజశేఖరం ప్రస్తుతం కాకినాడలో నివాసం ఉంటున్నారు. BA పూర్తిచేసిన ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్న రాజశేఖరానికి ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి వరించింది.