News March 4, 2025

MLC కౌంటింగ్: 4,320 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి

image

TG: ఆదిలాబాద్-నిజామాబాద్-కరీంనగర్-మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మూడో రౌండ్‌ ముగిసేసరికి 4,320 లీడ్ సాధించారు. ఇప్పటివరకు అంజిరెడ్డికి 23,246, నరేందర్ రెడ్డికి (కాంగ్రెస్) 18,296, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 15,740 ఓట్లు వచ్చాయి. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

Similar News

News February 8, 2026

చిన్న వయసులోనే మెచ్యూర్ అయితే..

image

చిన్న వయసులోనే పీరియడ్స్ రావడం వల్ల అమ్మాయిలు శారీరకంగా, మానసికంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఒంటరితనాన్ని అనుభవించే అవకాశం ఉంది. మెచ్యూర్ కారణంగా ఆందోళన, ఒత్తిడి, నిరాశ వంటి లక్షణాలు కనిపిస్తాయి. హార్మోన్ల మార్పుల కారణంగా నొప్పులు, టైప్-2 డయాబెటిస్, PCOS, మెటబాలిక్ సిండ్రోమ్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు.

News February 8, 2026

వచ్చే సంక్రాంతికి ‘సోగ్గాడే చిన్నినాయనా’ పార్ట్-3

image

కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున నటించిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ 2016 సంక్రాంతికి విడుదలై హిట్టయిన సంగతి తెలిసిందే. దీనికి సీక్వెల్‌ ‘బంగార్రాజు’లో నాగార్జున, నాగచైతన్య నటించారు. ఆ మూవీ 2022 సంక్రాంతికి రిలీజై ఆకట్టుకుంది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా మూడో పార్ట్ రానుంది. ‘వాసివాడి తస్సాదియ్యా.. 2027 JAN 15న సోగ్గాళ్లు వస్తే పండగ కలర్‌ఫుల్‌గా ఉంటుంది కదా’ అని అన్నపూర్ణ స్టూడియోస్ ట్వీట్ చేసింది.

News February 8, 2026

చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

<>చెన్నై <<>>మెట్రో రైల్ లిమిటెడ్ 19 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గలవారు ఫిబ్రవరి 23 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BE/BTech, ME/MTech అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.62,000 నుంచి రూ.2,70,000 వరకు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://chennaimetrorail.org