News March 28, 2025
ఏలూరు : రైలు కింద పడి వ్యక్తి మృతి

గుర్తుతెలియని వృద్ధుడు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఏలూరు నగరంలోని ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం నంబర్ – 2 సమీపంలో శుక్రవారం జరిగింది. సమాచారమందుకున్న రైల్వే ఎస్సై సైమన్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతునికి 60 – 65 ఏళ్లు ఉంటాయని తెలిపారు . వివరాలు తెలిసిన వారు సంప్రదించాలని ఆయన సూచించారు.
Similar News
News March 31, 2025
‘నాన్న, తమ్ముడిని బాగా చూసుకో..’ అంటూ ఆత్మహత్య

నిజామాబాద్(TG) విద్యార్థి రాహుల్ మాదాల చైతన్య అలహాబాద్ ఐఐఐటీలో ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం రాత్రి జల్వాలోని హాస్టల్ బిల్డింగ్ ఐదో అంతస్తు నుంచి దూకి చనిపోయాడు. పరీక్షల్లో ఫెయిల్ కావడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సూసైడ్‌కు ముందు ‘నాన్న, తమ్ముడిని బాగా చూసుకో అమ్మా..’ అని తల్లికి మెసేజ్ పెట్టాడు. దివ్యాంగుడైన రాహుల్ JEE మెయిన్స్‌లో ఆలిండియా 52వ ర్యాంక్ సాధించారు.
News March 31, 2025
ఇల్లందకుంట: 4 నుంచి సీతారాముల బ్రహ్మోత్సవాలు

KNR జిల్లా ఇల్లందకుంట సీతారాములవారి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 4 నుంచి ప్రారంభంకానున్నాయి. శ్రీరామనవమి సందర్భంగా ప్రతి ఏటా 13 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఇందులో భాగంగా కళ్యాణం, పట్టాభిషేకం, చిన్న రథం, పెద్ద రథం మొదలగు కార్యక్రమాలు ఉంటాయి. ఈ బ్రహ్మోత్సవాలకు హనుమకొండ, భూపాలపల్లి జిల్లా నుంచి భక్తులు అధిక సంఖ్యలో వెళ్తారు. ప్రసుత్తం ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు.
News March 31, 2025
ఇల్లందకుంట: ఏప్రిల్ 4 నుంచి సీతారాముల బ్రహ్మోత్సవాలు

KNR జిల్లా ఇల్లందకుంట సీతారాములవారి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 4 నుంచి ప్రారంభంకానున్నాయి. శ్రీరామనవమి సందర్భంగా ప్రతి సంవత్సరం 13 రోజులపాటు ఈ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఇందులో భాగంగా కల్యాణం, పట్టాభిషేకం, చిన్నరథం, పెద్దరథం మొదలగు కార్యక్రమాలు ఉంటాయి. ప్రసుత్తం ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీని ప్రభుత్వం ఏర్పాటుచేయలేదు. ఉమ్మడి KNR జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు.