News March 31, 2025
‘నాన్న, తమ్ముడిని బాగా చూసుకో..’ అంటూ ఆత్మహత్య

నిజామాబాద్(TG) విద్యార్థి రాహుల్ మాదాల చైతన్య అలహాబాద్ ఐఐఐటీలో ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం రాత్రి జల్వాలోని హాస్టల్ బిల్డింగ్ ఐదో అంతస్తు నుంచి దూకి చనిపోయాడు. పరీక్షల్లో ఫెయిల్ కావడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సూసైడ్‌కు ముందు ‘నాన్న, తమ్ముడిని బాగా చూసుకో అమ్మా..’ అని తల్లికి మెసేజ్ పెట్టాడు. దివ్యాంగుడైన రాహుల్ JEE మెయిన్స్‌లో ఆలిండియా 52వ ర్యాంక్ సాధించారు.
Similar News
News April 18, 2025
ఏసుక్రీస్తు త్యాగాన్ని గుర్తుచేసుకోవాలి: PM మోదీ

గుడ్‌ఫ్రైడే సందర్భంగా క్రైస్తవులనుద్దేశించి ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఈ పవిత్ర రోజున ఏసుక్రీస్తు త్యాగాన్ని మనం గుర్తు చేసుకోవాలన్నారు. ఆయనలోని దయ, కరుణ, క్షమాపణ వంటి సద్గుణాలు మనకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని చెప్పారు. ఇటు ఏపీ సీఎం చంద్రబాబు సైతం క్రీస్తు గొప్పతనాన్ని గుర్తు చేశారు. తన శరీరంలోకి మేకులు దించిన సమయంలో కూడా ఏసుక్రీస్తు శాంతిని ప్రబోధించారన్నారు.
News April 18, 2025
రేపు జేఈఈ మెయిన్ ఫలితాలు: NTA

జేఈఈ మెయిన్-2025 సెషన్-2 ఫలితాలను రేపు వెల్లడిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తాజాగా ప్రకటించింది. ఫైనల్ ఆన్సర్ కీలను ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు అధికారిక <
News April 18, 2025
హ్యాపీ బర్త్ డే ఐపీఎల్

భారతదేశపు అతిపెద్ద ఫ్రాంచైజీ క్రికెట్ టోర్నమెంట్ ఐపీఎల్ మొదలై నేటికి 18 ఏళ్లు పూర్తవుతోంది. 2008 ఏప్రిల్ 18న BCCI & లలిత్ మోడీ ఈ టోర్నీని ప్రారంభించారు. ప్రతి ఏటా రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులను అలరించే ఈ IPLకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ టోర్నమెంట్ ఎంతో మంది టాలెంటెడ్ యంగ్ ప్లేయర్స్‌ను భారత క్రికెట్ జట్టుకు సేవలందించే అవకాశాన్నిచ్చింది. ఇన్నేళ్లలో మీ ఫేవరెట్ టీమ్ ఏంటో కామెంట్ చేయండి.