News August 20, 2025
ఓరుగల్లు ఇలవేల్పు భద్రకాళి అమ్మవారి దర్శనం

భద్రకాళి అమ్మవారికి బుధరవారం ప్రత్యేక అలంకరణ చేశారు. ప్రాతఃకాల విశేష దర్శనంలో అమ్మవారు దర్శనమిచ్చారు. అనంతరం అమ్మవారికి విశేష పూజలు చేసి హారతి ఇచ్చారు. భక్తులు ఉదయం నుంచి ఆలయం చేరుకొని అమ్మవారిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. దేవస్థాన అర్చకులు తదితరులు ఉన్నారు.
Similar News
News August 20, 2025
మున్నేరుకు స్వల్పంగా పెరిగిన నీటిమట్టం

ఖమ్మం మున్నేరుకు వరద స్వల్పంగా పెరిగింది. సోమవారం 8 అడుగులకు తగ్గిన నీటిమట్టం, బుధవారం ఉదయం 10.50 అడుగులకు చేరింది. ప్రస్తుతం మున్నేరులో 30 వేల క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
News August 20, 2025
సంతమాగులూరులో డెంగ్యూ.. జాగ్రత్త.!

బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలంలోని పరిటాలవారిపాలెంలో ఓ డెంగ్యూ కేసు నమోదైన విషయం తెలిసిందే. గ్రామంలో డెంగ్యూ కేసు నమోదుతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామంలో వైద్య సిబ్బంది ఫీవర్ సర్వే చేపట్టారు. ఈ సర్వేలో ముగ్గురికి జ్వరాలు ఉన్నట్లుగా అధికారులు గుర్తించి వారికి పరీక్ష చేయగా నెగిటివ్ వచ్చినట్లుగా తెలిపారు.
News August 20, 2025
‘ఫౌజీ’ ఫొటో లీక్.. మేకర్స్ ఫైర్

డార్లింగ్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి తెరకెక్కిస్తోన్న ‘ఫౌజీ’ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఫొటోను గుర్తు తెలియని వ్యక్తులు లీక్ చేయడంపై మేకర్స్ ఫైర్ అయ్యారు. ‘సెట్స్‌లోని ఫొటోను షేర్ చేస్తున్నట్లు గుర్తించాం. మీకు ఉత్తమ అనుభవాన్ని అందించేందుకు మేము ప్రయత్నిస్తున్నాం. కానీ ఇలాంటి లీకులు వాటిని దెబ్బతీస్తాయి. షేర్ చేసిన వారి అకౌంట్స్‌ను బ్లాక్ చేయించి, సైబర్ క్రైమ్ కేసులు పెడతాం’ అని హెచ్చరించారు.