News April 9, 2026
కడప: ‘పదో తరగతి’ మూల్యాంకన రుసుము పెంచండి: APTF

పదో తరగతి పరీక్షల మూల్యాంకన రుసుమును 100% పెంచాలని కోరుతూ APTF నాయకులు గురువారం DEO శంషుద్దీన్‌కు వినతిపత్రం అందజేశారు. మూల్యాంకన విధుల్లో పాల్గొనే స్పెషల్ అసిస్టెంట్లకు TA, DAలు చెల్లించాలని, అలాగే ట్యాబ్‌లలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని కోరారు. APTF రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఖాదర్ బాషా ఆధ్వర్యంలో ఉపాధ్యాయ నేతలు DEOను కలిసి తమ సమస్యలను వివరించారు.
Similar News
News April 20, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు ఇలా.!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,330
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,104
* 10 గ్రాముల వెండి ధర రూ.2,530.
News April 20, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు ఇలా.!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,330
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,104
* 10 గ్రాముల వెండి ధర రూ.2,530.
News April 20, 2026
రేపు పులివెందుల రానున్న జగన్.. షెడ్యూల్ ఇదే!

YCP అధినేత జగన్ మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు బెంగళూరు నుంచి హెలికాప్టర్‌లో పులివెందుల రానున్నారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. రాత్రికి ఇక్కడే బస చేస్తారు. 22న లింగాల మండలం ఇప్పట్ల గ్రామంలో వైసీపీ నేత దివంగత సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. అనంతరం ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. 23వ తేదీ తిరిగి బెంగళూరుకు పయనమవుతారు.


