News February 4, 2026

కడియం నర్సరీ అందాలకు హాలీవుడ్ ప్రముఖుడి ఫిదా..!

image

కడియం నర్సరీల అందాలకు హాలీవుడ్ ప్రముఖుడు డాన్ చో ముగ్ధులయ్యారు. దక్షిణ కొరియా బృందంతో కలిసి శ్రీ సత్యదేవ నర్సరీని సందర్శించిన ఆయన, త్వరలో 450 ఎకరాల్లో ఇండో-కొరియన్ నర్సరీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మొక్కల ఎగుమతిపై నర్సరీ రైతులతో చర్చించారు. అంతర్జాతీయ స్థాయిలో కడియం మొక్కలకు గుర్తింపు రావడం పట్ల నర్సరీ యజమానులు సంతోషం వ్యక్తం చేశారు.

Similar News

News April 20, 2026

కాయకవే కైలాస.. బసవన్న మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శం!

image

బొమ్మూరు కలెక్టరేట్‌లో సోమవారం సంఘ సంస్కర్త బసవన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ కీర్తి చేకూరి బసవన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. “కాయకవే కైలాస” అనే ఆయన బోధన ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమని పేర్కొన్నారు. పని పట్ల నిబద్ధత, నిజాయితీతో కర్తవ్యాన్ని నిర్వహించడం ద్వారా సమాజానికి మేలు చేయవచ్చని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

News April 20, 2026

దళారుల ఉచ్చులో పడకండి: DTO

image

తూ.గో (D) రవాణాశాఖ సేవలు పూర్తిగా ఆన్‌లైన్‌లోనే అందుబాటులో ఉన్నట్లు DTO ఆర్. సురేశ్ సోమవారం తెలిపారు. లైసెన్స్ కోసం దళారులను ఆశ్రయించి మోసపోవద్దని వినియోగదారులకు సూచించారు. సమాచారం కోసం నేరుగా కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు. ఎవరైనా లంచం అడిగితే తక్షణమే తమకు ఫిర్యాదు చేయాలని స్పష్టం చేశారు. పారదర్శక సేవలను వినియోగించుకోవాలని ఆయన కోరారు.