News April 13, 2025
కడెం: ఉరేసుకొని యువతి ఆత్మహత్య

ఉరివేసుకొని యువతి మృతి చెందిన ఘటన కడెం మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై కృష్ణసాగర్‌రెడ్డి కథనం ప్రకారం.. మండలంలోని మర్రిగూడెం గ్రామానికి చెందిన అనూషను(21) శుక్రవారం సాయంత్రం ఓ విషయంలో తల్లి మందలించింది. మనస్తాపానికి గురై ఇంటి పక్కన ఉన్న షెడ్డులో ఉరేసుకుంది. అనూష తండ్రి రాజేశ్వర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News April 13, 2025
చికెన్ ఎక్కువగా తింటే?

కొందరికి చికెన్ లేనిదే ముద్ద దిగదు. రోజూ చికెన్ తింటే ఆరోగ్యానికి ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చికెన్ ఎక్కువ మోతాదులో తింటే బీపీ, గుండె జబ్బులు వస్తాయి. కొవ్వు పేరుకుపోయి బరువు పెరుగుతారు. రక్తంలో టాక్సిన్లు నిల్వ ఉండి ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదముంది. యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగిపోయి చేతి, కాలి వేళ్లలో స్ఫటికాలు పేరుకుపోయి కీళ్ల నొప్పులు వస్తాయి. వారానికి ఒకటి రెండు సార్లు తినడం ఉత్తమం.
News April 13, 2025
తాజా సినిమా ముచ్చట్లు

☛ మే 23న ప్రభాస్, త్రిష నటించిన ‘వర్షం’ సినిమా రీ రిలీజ్
☛ రేపు HYDలోని పార్క్ హయత్‌లో తమన్నా నటించిన ‘ఓదెల-2’ ప్రీ రిలీజ్ ఈవెంట్
☛ రూ.100 కోట్ల మార్కును దాటిన అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా కలెక్షన్స్
☛ మహేశ్ బాబు-రాజమౌళి సినిమాకు డైలాగ్ రైటర్‌గా దేవకట్టా?
☛ మూడు రోజుల్లో రూ.32.2 కోట్ల వసూళ్లు రాబట్టిన గోపీచంద్ మలినేని-సన్నీ డియోల్ సినిమా ‘జాట్’
News April 13, 2025
రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు

AP: తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ప్రకటించారు. ప్రజల హక్కులను కాపాడడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి పొంచి ఉన్న అతిపెద్ద ప్రమాదం YS జగన్ అని, గత ఐదేళ్లలో ఆయన రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారని అన్నారు. ఆయన వల్ల ఐదేళ్ల విలువైన సమయం కోల్పోయామని పేర్కొన్నారు.